Begin typing your search above and press return to search.

స్వీటీని అలా లాక్ చేసి..త్రిష‌ని ఇలా తెచ్చారా?

`విశ్వంభ‌ర‌`లో చిరంజీవికి జోడీగా త్రిష‌ని ఎంపిక చేయ‌డంపై చిన్న విమ‌ర్శ తెర‌పైకి వచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Feb 2024 9:30 AM GMT
స్వీటీని అలా లాక్ చేసి..త్రిష‌ని ఇలా తెచ్చారా?
X

`విశ్వంభ‌ర‌`లో చిరంజీవికి జోడీగా త్రిష‌ని ఎంపిక చేయ‌డంపై చిన్న విమ‌ర్శ తెర‌పైకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. రేసులో స్వీటీ అనుష్క పేరు కూడా బ‌లంగా తెర‌పైకి రావ‌డంతో యూవీ క్రియేష‌న్స్ అండ్ కో ఆమెని ఎంపిక చేయ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప్ర‌చారం సాగింది. పైగా చిరంజీవి ఇంత వ‌ర‌కూ పూర్తి స్థాయిలో సినిమా చేయ‌క‌పోవ‌డం.. చిరంజీవి వ‌య‌సుని సైతం స్వీటీ మ్యాచ్ చేస్తుంది తెర‌పై ఆ పెయిర్ కొత్త‌గా క‌నిపించ‌డానికి అవ‌కాశం ఉండ‌టంతో అనుష్కని ఎంపిక చేయ‌డానికి అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని అంతా భావించారు.


కానీ ఆమె స్థానంలో అనూహ్యంగా త్రిష‌ని తీసుకొచ్చి స‌ర్ ప్రైజ్ చేసారు. 18 ఏళ్ల క్రితం నాటి కాంబినేష‌న్ ని మ‌ళ్లీ యూవి క్రియేష‌న్స్ క‌లిపింది. దీంతో ఇది ఎలా సాధ్య‌మైంద‌ని ర‌క‌ర‌కాల క‌థ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయి. స్వీటీ స‌ద‌రు బ్యాన‌ర్ కి అంత కానిది అయిపోయిందా? అన్న విమ‌ర్శ‌సైతం వినిపించింది. అయితే తాజా స‌న్నివేశం చూస్తుంటే అనుష్క‌ని గ్రాండ్ గా రీలాంచ్ చేసే బాధ్య‌త‌నే యూవీ క్రియేష‌న్స్ మ‌రోసారి తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. `మిస్ శెట్టి..మిస్ట‌ర్ పొలిశెట్టి` తో అనుష్క అదే బ్యాన‌ర్ లో రీలాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే.

కానీ ఆ సినిమా అనుష్క రేంజ్ హిట్ కాదు. అనుష్క మాస్ ఫాలోయింగ్ కి ఆ సినిమా ఏమాత్రం రీచ్ అవ్వ లేదు. దీంతో స‌ద‌రు సంస్థ కూడా అనుష్క విష‌యంలో స‌రైన క‌థతో ముందుకు వెళ్ల‌లేదా? అన్న ప్ర‌శ్చా తాపం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో స్వీటీ తో ఏకంగా భారీ లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్నే ప్లాన్ చేసిన ట్లు తెలు స్తోంది. ఆ సినిమా కోసం క్రియేటివ్ మేక‌ర్ క్రిష్ నే రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదంతా బాగా ఆల‌స్య‌మైన అప్ డేట్.

వాస్తవానికి ఆ కాంబినేష‌న్ లో సినిమా ప‌ట్టాలెక్కేసింద‌ని తాజా స‌మాచారం. నిన్న‌టి రోజున అనుష్క వీడియో ఒక‌టి లీక్ అయిన సంగ‌తి తెలిసందో. ఓ హోట‌ల్ లో అనుష్క‌తో పాటు ప్ర‌మోద్ కూడా ఉన్నారు. దీంతో అస‌లు ఇప్పుడిప్ప‌డే బ‌య‌టకు వ‌స్తుంది. అనుష్క లీడ్ రోల్ లో క్రిష్ ఓ చిత్రాన్ని సెట్స్ పైకి తీసు కెళ్లిన‌ట్లు వినిపిస్తుంది. దానికి సంబంధించిన అప్ డేట్ త్వ‌ర‌లోనే మేక‌ర్స్ అధికారికంగా రివీల్ చేస్తార‌ని తెలిసింది. దీంతో చిరంజీవి సినిమాకి త్రిష‌ని సెట్ చేసి..క్రిష్ సినిమా కోసం అనుష్క‌ని సీన్ లోకి తెచ్చిన ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో `వేదం` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.