Begin typing your search above and press return to search.

చిరుపై కామెంట్స్ గోల.. ప్రశాంత్ వర్మ స్ట్రాంగ్ కౌంటర్!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమాతో మరోసారి తన మార్క్ ను చూపించారు.

By:  Tupaki Desk   |   12 Jan 2024 6:01 AM GMT
చిరుపై కామెంట్స్ గోల.. ప్రశాంత్ వర్మ స్ట్రాంగ్ కౌంటర్!
X

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమాతో మరోసారి తన మార్క్ ను చూపించారు. తన మేకింగ్ టాలెంట్ తో.. ఆడియెన్స్ కు గూస్ బంప్స్ తెప్పించారు. క్లైమాక్స్ లో సూపర్ ఎలివేషన్లు ఇచ్చి అదరగొట్టేశారు. చివరలో మూవీ సీక్వెల్ ను కూడా ప్రకటించేశారు. బాహుబలిలో కట్టప్ప ట్విస్ట్‌లా.. ఈ చిత్రంలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటనే ట్విస్ట్ ఇచ్చారు.

అయితే ఈ సినిమా తో పాటు మహేశ్ బాబు గుంటూరు కారం కూడా ఈరోజే రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాకు స్క్రీన్లు కూడా దొరకలేదు. దీంతో థియేటర్స్ దొరక్క, సపోర్ట్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొందీ సినిమా.

ఇటీవలే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఆ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. మూవీకి స్ట్రాంగ్ సపోర్ట్ గా నిలిచారు. వేడుకనుద్దేశించి చిరు సుదీర్ఘంగా స్పీచ్ ఇచ్చారు. హనుమాన్ మూవీ హిట్ కొడుతుందని అప్పుడే చెప్పారు. ఆ సమయంలో ప్రశాంత్ వర్మకు బదులు అనుకోకుండా సురేశ్ వర్మ అని పలికారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ పేరును కరెక్ట్ గానే చెప్పారు.

ఇక, ఈవెంట్ తర్వాత చాలా మంది నెటిజన్లు.. చిరంజీవి ఫస్ట్ పలికిన సురేశ్ వర్మ పేరును పట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారు. పేరు కూడా మర్చిపోయారా అని ట్వీట్లు చేశారు. ఈ విషయంపై ప్రశాంత్ వర్మ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ట్వీట్ చేశారు. “పేరులో ఏముంది.. పిలిచిన వ్యక్తి పలుకులో ప్రేమ ఉన్నప్పుడు!” అంటూ ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రశాంత్ ట్వీట్ పై చిరు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురుభక్తి అంటే ఇలా ఉండాలని చెబుతున్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఒక్కో సినిమాతో తన రేంజ్ ను పెంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. 'అ' సినిమాతో డైరెక్టర్ గా జర్నీ స్టార్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత కల్కి, జాంబిరెడ్డి సినిమాలో సూపర్ హిట్లు కొట్టేశారు. ఇప్పుడు సూపర్ హీరో యూనివర్స్ లో భాగంగా తేజ సజ్జతో హనుమాన్ మూవీ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా మారిపోయారు ప్రశాంత్ వర్మ.