Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : కోనేరు వారి వివాహ వేడుకలో మెగా సందడి

పద్మ విభూషన్‌ మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం సతీ సమేతంగా అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   17 Feb 2024 7:23 AM GMT
క్లిక్‌ క్లిక్‌ : కోనేరు వారి వివాహ వేడుకలో మెగా సందడి
X

పద్మ విభూషన్‌ మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం సతీ సమేతంగా అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే. చిరంజీవి అక్కడకు హాలీడేస్ కు వెళ్లారని అంతా అనుకున్నారు. కానీ అక్కడ చిరంజీవి బిజీబిజీగా గడుపుతున్నారు. సన్మానాలు సత్కారాల్లో చిరు మునిగి పోతున్నారు.


తాజాగా చిరంజీవి తన ఆప్త మిత్రుడు ఎన్‌ఆర్‌ఐ కుమార్‌ కోనేరు తనయుడు కిరణ్‌ కోనేరు వివాహ మహోత్సవంలో పాల్గొన్నాడు. కిరణ్‌ కోనేరు, శైల్య ల వివాహం లాస్ ఏంజిల్స్ లో వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో చిరంజీవి సతీ సమేతంగా పాల్గొన్నారు.


చిరంజీవి దంపతులు మాత్రమే కాకుండా విక్టరీ వెంకటేష్ కూడా సతీ సమేతంగా పాల్గొన్నారు. కిరణ్‌ కోనేరు, శైల్య వివాహ వేడుకలో ఇద్దరు సీనియర్‌ స్టార్‌ హీరోలు పాల్గొనడం, అది కూడా లాస్ ఏంజిల్స్ లో అవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా సోషల్‌ మీడియా ద్వారా ఈ ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు మెగా మరియు దగ్గుబాటి ఫ్యాన్స్ కు కన్నుల విందు చేస్తున్నాయి. ఇద్దరు సీనియర్ హీరోలు ఒకే వేడుకలో పాల్గొనడం ఖచ్చితంగా అరుదైన అందమైన దృశ్యం అన్నట్లుగా సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొన్నటి వరకు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్‌ లో పాల్గొన్న చిరంజీవి మళ్లీ మార్చి మొదటి వారం నుంచి ఆ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక చిరంజీవి విశ్వంభర సినిమాతో 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.