Begin typing your search above and press return to search.

మెగాస్టార్ 157 లైన్ క్లియ‌ర్ అయిందా?

అయితే తాజాగా ప్రాజెక్ట్ క‌న్ప‌మ్ అయిన‌ట్లే...157 డైరెక్ట‌ర్ గా హ‌రీష్ లాక్ అయిన‌ట్లు మెగా కాంపౌండ్ వ‌ర్గాల నుంచి బ‌లంగా వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   31 March 2024 3:30 PM GMT
మెగాస్టార్ 157 లైన్ క్లియ‌ర్ అయిందా?
X

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాకి లైన్ క్లియ‌ర్ అయిందా? ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని అవాంత‌రాలు తొల‌గిపోయిన‌ట్లేనా? ప్రారంభోత్స‌వ ముహూర్తం కూడా పెట్టేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. చిరంజీవి నుంచి 156..157 సినిమాల‌కు సంబంధించి ఒకేసారి ప్ర‌క‌ట‌నొచ్చిన సంగ‌తి తెలిసిందే. ముందుగా వ‌శిష్ట సినిమా 157 అయితే... మ‌రో ద‌ర్శ‌కుడి సినిమా 156 గాతెర‌పైకి వ‌చ్చింది. అటుపై స్టోరీ విష‌యంలో క్లారిటీ లోపించ‌డంతో ముందుగా వ‌శిష్ట ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డంతో అది 156 అయింది.

ఆ త‌ర్వాత 157పై కొన్ని నెల‌లు పాటు నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఈ సినిమాని స్వ‌యంగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించ‌డానికి ముందుకు రావ‌డంతో హిట్ కంటెంట్ తోనే రావాలి అన్న ధీమాతో డైల‌మా మొద‌లైంది. అప్ప‌టి నుంచి ర‌క‌ర‌కాల ద‌ర్శ‌కుల పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ చివ‌రిగా మాస్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ లాక్ చేసిన‌ట్లు కొన్ని రోజులుగా ప్ర‌చారం సాగుతోంది. హ‌రీష్ చెప్పిన లైన్ న‌చ్చ‌డంతో చిరు ముందుకెళ్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది.

అయితే తాజాగా ప్రాజెక్ట్ క‌న్ప‌మ్ అయిన‌ట్లే...157 డైరెక్ట‌ర్ గా హ‌రీష్ లాక్ అయిన‌ట్లు మెగా కాంపౌండ్ వ‌ర్గాల నుంచి బ‌లంగా వినిపిస్తుంది. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ ....ర‌వితేజ హీరోగా 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్' స్పీడ‌ప్ చేయ‌డం వెనుక అస‌లు కార‌ణం ఇదేన‌ని తెర‌పైకి వ‌స్తోంది. ఈ చిత్రాన్ని జులైలో ప్రారంభించాల‌ని ముహూర్తం కూడా పెట్టేసిన‌ట్లు తెలిసింది. జులై నుంచి చిరంజీవి 'విశ్వంభ‌ర‌'తో పాటు157వ సినిమా షూట్ లో కూడా పాల్గొంటార‌ని స‌మాచారం.

'విశ్వంభ‌ర' షూటింగ్ తొంద‌ర‌గా ఎలాగూ పూర్తి కాదు. సోషియా ఫాంట‌సీ సినిమా...షూట్ అంతా దాదాపు సెట్స్ లోనే ఎక్కువ‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో నే 157 షూటింగ్ కూడా దానికి అనుబంధంగా ప్లాన్ చేస్తున్నారుట‌. అవ‌స‌రం మేర రెండు సినిమా సెట్లు ఒకేచోట వేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారుట‌.