పట్టాలెక్కుతున్న చిరు - అనిల్ ప్రాజెక్ట్
సైలెంట్‌గా విడుదలై ఎవరూ ఊహించని స్థాయిలో వరల్డ్ వైడ్‌గా రూ.220 కోట్లకు పైనే రాబట్టి వెంకీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది.
By: Tupaki Desk | 15 May 2025 11:42 AM ISTవిక్టరీ వెంకటేష్‌తో ఈ సంక్రాంతికి బిగ్ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. `సంక్రాంతికి వస్తున్నాం` పేరుతో కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్‌కు క్రైమ్ ఎలిమెంట్‌ని లింక్ చేసి తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సైలెంట్‌గా విడుదలై ఎవరూ ఊహించని స్థాయిలో వరల్డ్ వైడ్‌గా రూ.220 కోట్లకు పైనే రాబట్టి వెంకీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది.
ట్రేడ్ వర్గాలని సైతం విస్మయానికి గురి చేసిన ఈ మూవీ `గేమ్ ఛేంజర్` నష్టాలతో నిండామునిగిన దిల్ రాజు, శిరీష్ ద్వయాన్ని ఒడ్డున పడేసి రక్షించింది. ఈ హిలేరియస్ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని తెలియజేస్తూ అనిల్ రావిపూడి ఓ ప్రమోషనల్ వీడియోని విడుదల చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుష్మిత కొనిదెల సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాకు ప్రధాన బలంగా నిలిచిన సంగీత దర్శకుడు భీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ చేస్తున్నాడు. చిరు 157వ ప్రాజెక్ట్‌గా తెరపైకి రానున్నీ మూవీని హిలేరియస్ యాక్షన్ డ్రామాగా అనిల్ రావిపూడి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా?; అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది టీమ్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ని ఈ నెల 23 నుంచి ప్రారంభించబోతున్నారు. అది కూడా హైదరాబాద్‌లోనే ప్రారంభం కాబోతోంది. ఫస్ట్‌షెడ్యూల్‌ని ఇక్కడే పూర్తి చేయబోతున్నారు. ఇందులో చిరుకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలని షూట్ చేస్తారట. ఇందులో విక్టరీ వెంకటేష్ ఓ కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాతికి రిలీజ్ చేయనున్నవిషయం తెలిసిందే.
