చిరు మూవీలో వెంకీ.. నిజమేనా? ఓకే చెప్పారా?
రీసెంట్ గా ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు డైరెక్టర్.
By: Tupaki Desk | 29 March 2025 8:57 PM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. త్వరలోనే రిలీజ్ కానుంది. అదే సమయంలో చిరు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు డైరెక్టర్.
సినిమాలోని శివశంకర వరప్రసాద్ రోల్ ను చిరుకు నెరేట్ చేసినట్లు తెలిపారు. చిరంజీవి ఒరిజినల్ నేమ్ అదేనన్న విషయం తెలిసిందే. దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీపై ఆడియన్స్ లో అంచనాలు కూడా పెంచింది. ఇప్పుడు మరో వార్త.. కొన్ని గంటలుగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
చిరు- అనిల్ రావిపూడి మూవీలో విక్టరీ వెంకటేష్ ఓ పాత్ర పోషించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వెంకీని మూవీ టీమ్ సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన ఓకే చెప్పారో లేదో అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే చిరంజీవి, వెంకటేష్ మధ్య మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే.
ఇద్దరూ కలిసి ఓ మూవీ చేయాలని వారి వారి ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుకుంటారు. కొద్ది రోజుల క్రితం జరిగిన వెంకటేష్ 75వ మూవీ ఈవెంట్ కు చిరు గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో మల్టీస్టారర్ టాపిక్ ప్రస్తావనకు రాగా.. మెగాస్టార్ గారు అలా ముందు వెళ్తుంటే తాను వెనుక కత్తి పట్టుకుని నడిచే క్యారెక్టర్ చేయాలని ఉందని వెంకీ అన్నారు.
ఇప్పుడు చిరు మూవీలో వెంకీ కీలక పాత్ర పోషిస్తారని మాత్రం టాక్ వినిపిస్తోంది. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడితో వెంకటేష్ కు మంచి అనుబంధం ఉన్న విషయం కూడా తెలిసిందే. వారి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3తోపాటు రీసెంట్ గా సంక్రాంతికి వచ్చి ఓ రేంజ్ లో సందడి చేసిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్స్ గా నిలిచాయి.
అంతే కాదు త్వరలో కలిసి మరిన్ని మూవీస్ చేస్తామని ఇద్దరూ ప్రకటించారు. దీంతో వారి మధ్య బాండింగ్ ఎలా ఉందో క్లియర్ గా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు అటు చిరుతో రిలేషన్.. ఇటు అనిల్ రావిపూడితో అనుబంధం.. ఈ రెండు కారణాలతో ఆయనకు మూవీ టీమ్ రోల్ ఆఫర్ చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఆయన ఓకే చెప్పారో లేదో.. ఒకవేళ ఓకే చెబితే ఎలాంటి రోల్ లో కనిపిస్తారో వేచి చూడాలి.
