చిరు- రావిపూడి.. ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్లే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 4 May 2025 6:45 PMటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సినిమా లాంఛనంగా స్టార్ట్ అవ్వగా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు.
షూటింగ్ లొకేషన్స్ తో పాటు క్యాస్టింగ్ ను ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నట్లు సమాచారం. అందులో ఓ హీరోయిన్ రోల్ కోసం స్టార్ నటి నయనతారను రంగంలోకి దించేందుకు మేకర్స్ ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు తెలిసింది.
అయితే రెమ్యునరేషన్ విషయంలో ఇంకా చర్చలు కొలిక్కి రాలేదని సమాచారం. దీంతో నయనతార ఇంకా ఓకే చెప్పారో లేదో ఇంకా తెలియదు. అదే సమయంలో అంతా అనుకున్నట్టు జరిగితే చిరు, నయన్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ఇప్పటికే వారిద్దరూ సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాల్లో కలిసి నటించారు.
సైరా నరసింహారెడ్డిలో చిరు భార్యగా నటించారు నయన్. కానీ ఆ మూవీ అప్పట్లో యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ లో చెల్లిగా యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు చాలా ప్రాంతాల్లో మూవీ ఆకట్టుకున్నా కొందరికి మాత్రం ఎక్కలేదు. దీంతో ఇప్పుడు ఆ కాంబో సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ అంతా ఆశిస్తున్నారు.
కానీ హీరోయిన్ గా నయన్ పేరును అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇంకా వెయిట్ చేయాల్సిందే. అయితే అంతకుముందు హీరోయిన్ గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. నయన్ కాకుండా మరో యంగ్ హీరోయిన్ ను మేకర్స్ ఫిక్స్ చేయనున్నారని సమాచారం.
ఇక మూవీ విషయానికొస్తే.. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడిన కథతో అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారు. సినిమాలో శివ శంకర వరప్రసాద్ గా తన ఒరిజినల్ పేరుతో ఉన్న పాత్రలో సందడి చేయనున్నారు. స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తుండగా.. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.