Begin typing your search above and press return to search.

విశ్వంభర.. అలా ఎందుకు జరిగింది?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు

By:  Tupaki Desk   |   10 March 2024 2:30 AM GMT
విశ్వంభర.. అలా ఎందుకు జరిగింది?
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సోషల్ ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కీలక షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు.

అయితే అనౌన్స్మెంట్ నుంచే మూవీ లవర్స్ లో ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి సరసన సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్లో చిరంజీవి, త్రిష లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు మేకర్స్. అందుకోసం హైదరాబాద్ లో భారీ సెట్లు కూడా నిర్మించారు. ప్రస్తుతం ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా టీమ్ లో కీలక మార్పు జరిగినట్లు తెలుస్తోంది. విశ్వంభర మూవీకి మాటలు అందిస్తున్న సాయి మాధవ్ బుర్రా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో మరో రైటర్.. టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చారట. ఆయన ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సాయి మాధవ్ కొన్ని సన్నివేశాలను రాయగా.. అనూహ్యంగా తప్పుకోవడం వెనుక అసలు కారణాలు తెలియరాలేదు.

ప్రస్తుతం సాయి మాధవ్ బుర్రా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి మూవీకి కూడా ఆయనే మాటలు అందిస్తున్నారు. త్వరలోనే నిర్మాతగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఓ కొత్త ద‌ర్శ‌కుడ్ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. తన కొత్త మూవీకి ఆయనే క‌థ‌, స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారు.

మరోవైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి విశ్వంభర సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమారు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. 2025 జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందిస్తుండగా.. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప‌నిచేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని నెలలపాటు వెయిట్ చేయాల్సిందే.