Begin typing your search above and press return to search.

అన్న‌య్య ఈసారి సీరియస్ గానే ఆలోచిస్తున్నారా?

మెగాస్టార్ చిరంజీవికి `ఆచార్య‌`..`భోళా శంక‌ర్` రూపంలో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Aug 2023 10:30 AM GMT
అన్న‌య్య ఈసారి  సీరియస్ గానే ఆలోచిస్తున్నారా?
X

మెగాస్టార్ చిరంజీవికి `ఆచార్య‌`..`భోళా శంక‌ర్` రూపంలో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాల ప‌రాజ‌యంతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. వీటి వైఫ‌ల్యం వెనుక చిరంజీవి కూడా కార‌ణ‌మా? అన్న సందేహం తొలి నుంచి ఉండ‌నే ఉంది. కొన్ని కొన్ని స‌న్నివేశాలు రాయ‌డం వెనుక మెగాస్టార్ ప్రోత్బ‌లం ఉంద‌ని ఆచార్య ప్లాప్ అనంత‌రం మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. వాటికి కౌంట‌ర్ గా అటుపై కొంత మంది మెగా స‌న్నిహితులు ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉంది.

ఆయ‌న జ‌డ్డ్ మెంట్ ఎప్పుడు కరెక్ట్ అని చాలా బలంగా చెప్పారు. మ‌రి భోళా శంక‌ర్ లో కూడా చిరంజీవి హ‌స్తం ఏదైనా ఉందా? లేదా? అన్న‌ది మాత్రం ఆ పెరుమాళ్ల‌కే ఎరుక‌. ఏది ఏమైనా ద‌ర్శ‌కుల అనుభ‌వం ముందు చిరంజీవి అనుభం అన్న‌ది అపార‌మైంది. ఈ నేప‌థ్యంలో పూర్తి బాధ్య‌త ద‌ర్శ‌కుల‌పైనా వేయాలా? అన్న‌ది ఆలోచించాల్సి అంశం. మ‌రి ఈ ప్ర‌తికూల ప‌వ‌నాల నేప‌థ్యంలో మెగాస్టార్ లో మేధో మ‌థ‌నం మొద‌లైందా? చేసిన త‌ప్పిదాలు మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా దిద్ద‌బాటు చ‌ర్య‌ల‌కు పూనుకుం టున్నారా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది.

చిరంజీవి లిస్ట్ లో ఇప్ప‌టికే కొంత మంది ద‌ర్శ‌కులున్న సంగ‌తి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ‌..వ‌శిష్ట‌... మారుతి.. వెంకీ కుడుముల ఇలా కొంత మంది ఉన్నారు. ముందుగా క‌ళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ని భోళా శంక‌ర్ త‌ర్వాత ప‌ట్టాలెక్కిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. అయితే ఆ సినిమా వైఫ‌ల్యం త‌ర్వాత క‌ళ్యాణ్ తో చిరు ముందుకెళ్తారా? అన్న కొత్త డౌట్ రెయిజ్ అయింది. ఈనేప‌థ్యంలో చిరు లిస్ట్ లోకి త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ వ‌చ్చారు.

చిరంజీవి తెలుగు మేక‌ర్స్ పై న‌మ్మ‌కాన్ని కోల్పోయి ముర‌గ‌దాస్ ని లైన్ లోకి తెస్తున్నారా? అన్న కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. ఇంకా చిరు లిస్ట్ లోకి ఇలాంటి పేర్లు చాలా రావ‌డానికి అవ‌కాశం ఉంది. ఈ ర‌క‌మైన ప్ర‌చారంతో చిరంజీవి విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు ఫోక‌స్ చేస్తుంది. ఆయ‌నంత సీరియ‌స్ గా లేక‌పోతే కొత్త ద‌ర్శ‌కుల పేర్లు ఎందుకు తెర‌పైకి వ‌స్తాయి? అన్న‌ది బ‌ల‌మైన కార‌ణంగా వినిపిస్తోంది.