Begin typing your search above and press return to search.

శ్రీకాంత్ ని స‌ర్ ప్రైజ్ చేసిన అన్న‌య్య‌!

కొన్ని ద‌శాబ్ధాలుగా ఇద్ద‌రి మ‌ధ్య ఆ బాండింగ్ ఉంది. చిరంజీవి స్పూర్తితోనే శ్రీకాంత్ సినిమాల్లోకి వచ్చి స‌క్సెస్ అయ్యాడు

By:  Tupaki Desk   |   24 March 2024 4:57 AM GMT
శ్రీకాంత్ ని స‌ర్ ప్రైజ్ చేసిన అన్న‌య్య‌!
X

మెగాస్టార్ చిరంజీవి- శ్రీకాంత్ ల మ‌ధ్య ఉన్న అనుభంధం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చిరంజీవిని అన్న‌య్య అంటూ సొంత త‌మ్ముడి ప్రేమ‌నే పంచుతుంటాడు శ్రీకాంత్. చిరంజీవి సైతం త‌మ్ముడిలా భావిస్తుంటాడు. త‌న‌ని త‌న కుటుంబంలో స‌భ్యుడిలా చూస్తుంటారు చిరు. కొన్ని ద‌శాబ్ధాలుగా ఇద్ద‌రి మ‌ధ్య ఆ బాండింగ్ ఉంది. చిరంజీవి స్పూర్తితోనే శ్రీకాంత్ సినిమాల్లోకి వచ్చి స‌క్సెస్ అయ్యాడు.

ఫ్యామిలీ హీరోగా ఇండ‌స్ట్రీని కొన్నాళ్ల పాటు ఏలాడు. అత‌డు అవ‌కాశాలు అందుకోవ‌డంలో చిరంజీవి కూడా స‌హ‌క‌రించారు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. చిరు హీరోగా న‌టించిన చాలా చిత్రాల్లో శ్రీకాంత్ కీల‌క పాత్ర‌లు పోషించాడు. ముఖ్యంగా 'శంక‌ర్ దాదా ఎంబీబీఎస్' లాంటి చిత్రంలో శ్రీకాంత్-చిరు పాత్ర‌లు ప్ర‌త్యేకంగా హైలైట్ అవుతాయి. మ‌రి ఇప్పుడు అలాంటి త‌మ్ముడు కోసం చిరంజీవి ఏం చేసారో ? తెలిస్తే స‌ర్ ప్రైజ్ తో పాటు షాక్ అవ్వ‌డం ఖాయం.

నిన్న‌టి రోజున శ్రీకాంత్ పుట్టిన రోజు కావ‌డంతో నేరుగా చిరంజీవి శ్రీకాంత్ ఇంటికెళ్లి విష్ చేసారు. అంతేనా చిరంజీవి స్వ‌యంగా కేక్ కొని తీసుకెళ్లి శ్రీకాంత్ తో క‌ట్ చేయించారు. కేక్ పై' హ్యాపీ బ‌ర్త్ డే శ్రీకాంత్. ల‌వ్ ప్ర‌మ్ అన్న‌య్య' అంటూ రాయించారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌తో కాసేపు ముచ్చ‌టించారు. శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ కెరీర్ సంగ‌తి విశేషాలు అడిగి తెలుసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆ కుటుంబంతో చిరంజీవి చాలా కాలంగా ఎంతో స్నేహంగా..చ‌నువుగా మెలుగుతున్నారు.

అయితే నేరుగా ఇంటికెళ్లి మ‌రీ విష్ చేసిన సంద‌ర్భం మాత్రం ఇంత వ‌ర‌కూ చోటు చేసుకోలేదు. అలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. దీంతో ఏంటి ఈ స్పెష‌ల్ విష‌స్ అన్న టాపిక్ అభిమానుల్లో..ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ప్ర‌స్తుతం శ్రీకాంత్ ..మెగా ప‌వ‌ర్ ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 'గేమ్ ఛేంజ‌ర్' లో... యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న 'దేవ‌ర‌'లో న‌టిస్తున్నాడు. చిరంజీవి న‌టిస్తోన్న 'విశ్వంభ‌ర‌'లో మాత్రం ఛాన్సు రాలేదు.