Begin typing your search above and press return to search.

ఆ తల్లిదండ్రులకు మెగాస్టార్ భరోసా

మీ పిల్లలకు ఛాన్స్ ఇవ్వండి... వారి అభిరుచికి తగ్గట్లుగా ఇండస్ట్రీలో అడుగు పెడితే వారు ఒక్క విజయంతో

By:  Tupaki Desk   |   7 Aug 2023 7:51 AM GMT
ఆ తల్లిదండ్రులకు మెగాస్టార్ భరోసా
X

చిరంజీవి భోళా శంకర్ సినిమా తో ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. గత రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ను శిల్ప కళా వేదికలో జరిగింది. పలువురు యువ దర్శకులు, నిర్మాతలు ఇంకా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఆ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకునే వారికి సందేశం ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు నిర్మాతలు నన్ను అభిమానిస్తూ ఇండస్ట్రీకి వచ్చాను అంటూ చెబుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అంటే కష్టపడాలి.. మంచి ప్రతిభ ఉంటే తప్పకుండా ఇండస్ట్రీకి రండి మీకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని చిరంజీవి హామీ ఇచ్చారు.

ఇండస్ట్రీకి అంటే భయపడే తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో వ్యాఖ్యలు చేయడం జరిగింది.

మీ పిల్లలకు ఛాన్స్ ఇవ్వండి... వారి అభిరుచికి తగ్గట్లుగా ఇండస్ట్రీలో అడుగు పెడితే వారు ఒక్క విజయంతో మీ స్థాయిని మీ యొక్క గౌరవాన్ని పెంచుతారు అంటూ చిరంజీవి వారికి భరోసా ను ఇవ్వడం జరిగింది.

సినిమా ఇండస్ట్రీలో కొత్త వారికి ఛాన్స్ లు ఉంటూనే ఉంటాయి. ఈమధ్య కాలంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్ ను ఉపయోగించుకుని కూడా తమ ప్రతిభను నిరూపించుకుంటూ ఉంటారు. మనలో ప్రతిభ ఉంటే తప్పకుండా ఆఫర్లు వస్తాయి.. మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కొత్త వారికి హామీ ఇచ్చారు. ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొత్త వారు, పెద్దగా బ్యాక్ గ్రౌండ్‌ లేని వారు ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు.