Begin typing your search above and press return to search.

మెగా బ్యానర్ ని పట్టించుకోని మెగాస్టార్..?

ఆహా కోసం అన్ స్టాపబుల్ షో చేసిన బాలకృష్ణ ఆ టైంలో అల్లు అరవింద్ తో బాగా క్లోజ్ అయ్యారు

By:  Tupaki Desk   |   15 Feb 2024 12:30 AM GMT
మెగా బ్యానర్ ని పట్టించుకోని మెగాస్టార్..?
X

మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత మెగా బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగే క్రమంలో గీతా ఆర్ట్స్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అందుకే గీతా ఆర్ట్స్ ని మెగా బ్యానర్ అనే ముద్ర వేశారు. అల్లు అరవింద్, చిరంజీవి మధ్య అండర్ స్టాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరు రాజకీయ రంగ ప్రవేశంతో పదేళ్లు సినిమాలకు దూరంగా కాగా రీ ఎంట్రీ తర్వాత ఆయన ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నారు.

అయితే ఖైదీ నెంబర్ 150 నుంచి చిరు మళ్లీ మెగా ఫ్యాన్స్ ని అలరించేందుకు సినిమాలు చేస్తుండగా చేసిన ఐదారు సినిమాల్లో ఒక్కటి కూడా గీతా ఆర్ట్స్ లో చేయలేదు. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాతోనే కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి అందులో సినిమాలు చేస్తున్నారు. సొంత బ్యానర్ వచ్చే సరికి గీతా ఆర్ట్స్ పై ప్రియారిటీ తగ్గింది.

అయినా సరే అల్లు అరవింద్ అడిగితే చిరు కాదనే ప్రసక్తి లేదు. కానీ ఈ కాంబో కుదరాలంటే మంచి కథ.. స్టార్ డైరెక్టర్.. అదిరిపోయే కాంబినేషన్ సెట్ అవ్వాలి. అది కుదరకనే ఇన్నాళ్లు గీతా ఆర్ట్స్ లో చిరంజీవి సినిమా చేయట్లేదని టాక్. చిరుతో చేయడం అటుంచితే చిరు బదులుగా బాలకృష్ణతో సినిమాకు లైన్ చేస్తున్నారు అల్లు అరవింద్.

ఆహా కోసం అన్ స్టాపబుల్ షో చేసిన బాలకృష్ణ ఆ టైంలో అల్లు అరవింద్ తో బాగా క్లోజ్ అయ్యారు. అందుకే ఈ కాంబోలో సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. బోయపాటితో బాలయ్య చేసే అఖండ 2 గీతా ఆర్ట్స్ లోనే ఉంటుందని టాక్. అయితే బాలయ్యతో ఓకే కానీ బావ చిరంజీవితో అల్లు అరవింద్ సినిమా ఎప్పుడు చేస్తాడా అని మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత పీపుల్ మీడియా తో కలిసి మరో సినిమా చేస్తున్నట్టు టాక్. ఆ సినిమాకు సుస్మిత కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. మరి గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా ఎప్పుడు చేస్తాడన్నది చూడాలి. ఎలాగు లేట్ అయ్యింది కాబట్టి ఈసారి గీతా ఆర్ట్స్ తో చిరు సినిమా చేస్తే మాత్రం నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో అటెంప్ట్ చేస్తారని చెప్పొచ్చు.