Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు!

ఇప్పటికే పలు కీలక షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది

By:  Tupaki Desk   |   15 April 2024 9:30 AM GMT
మెగా ఫ్యాన్స్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు!
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సీనియర్ బ్యూటీ త్రిష నటిస్తున్న ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ మూవీగా సిద్ధం చేస్తున్నారు వశిష్ఠ. అంజి తర్వాత మళ్లీ చిరు ఇన్నాళ్లకు అలాంటి జోనర్ లో సినిమా చేస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే పలు కీలక షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు మెగాస్టార్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయకపోయినా.. ఏదో విధంగా లీక్ అవుతూనే ఉంది! ఇటీవల సెట్స్ లో చిరును పవన్, నాగబాబు కలవడంతో మెగాస్టార్ లుక్స్ బయటకొచ్చాయి. ఆ తర్వాత పలువురు డైరెక్టర్లు కూడా చిరంజీవిని కలిశారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే వాటిలో డైరెక్టర్ మెహర్ రమేష్ తో చిరు దిగిన పిక్ పట్ల మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారా అని డౌట్ పడ్డారు. ఇంకోసారి ఆయనకు అవకాశం ఇవ్వద్దొన్నయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫ్లాప్ ఇచ్చినా క్లోజ్ గా ఉంటున్నారంటే అది చిరు గొప్పతనమని చెబుతున్నారు. ఇలా నెట్టింట రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి మెహర్ రమేష్ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

మెహర్ రమేష్.. గతేడాది మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ మూవీ తీశారు. తమిళ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భోళాశంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ అందుకుంది. దీంతో అప్పట్లో మెహర్ రమేష్ పై ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. ఆయనకు ఛాన్స్ ఇవ్వడంపై ఫ్యాన్స్ కోపమయ్యారు కూడా. అసలెందుకు ఛాన్స్ ఇచ్చారని చిరును ప్రశ్నించారు.

అయితే తాజాగా చిరంజీవిని కలవడంపై మెహర్ రమేష్ ఇన్ స్టాలో క్లారిటీ ఇచ్చారు. "పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యను కలిశాను. ఎల్బీ స్టేడియంలో మే 4వ తేదీన జరగనున్న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే ఈవెంట్‌ కు ఆహ్వానించాను. టీఎఫ్డీఏ ప్రెసిడెంట్ వీరశంకర్ తోపాటు పలువురితో కలిసి వెళ్లి ఆయనను విశ్వంభర సెట్స్‌లో కలిశాం" అని స్పష్టతనిచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు!