Begin typing your search above and press return to search.

త్రిష, మన్సూర్ అలీ వివాదంపై చిరు ఏమన్నారంటే..

లియో యాక్టర్ మన్సూర్ అలీ ఖాన్ పై త్రిష చేసిన వల్గర్ కామెంట్స్ ఎంత పెద్ద వివాదానికి దారితీశాయో తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Nov 2023 8:43 AM GMT
త్రిష, మన్సూర్ అలీ వివాదంపై చిరు ఏమన్నారంటే..
X

లియో యాక్టర్ మన్సూర్ అలీ ఖాన్ పై త్రిష చేసిన వల్గర్ కామెంట్స్ ఎంత పెద్ద వివాదానికి దారితీశాయో తెలిసిందే. గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. త్రిష పై మన్సూర్ అలీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సినీ సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఈ ఇష్యు పై ఒక్కొక్కరుగా స్పందిస్తూ త్రిష కి అండగా నిలుస్తున్నారు.

ఇప్పటికే ఈ ఇష్యూ పై టాలీవుడ్ హీరో నితిన్ రియాక్ట్ అవ్వగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందిస్తూ త్రిష కు మద్దతుగా నిలవడమే కాకుండా అసలు మహిళలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని క్షమించకూడదని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ..

" త్రిష గురించి మన్సూర్ అలీ ఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్టుకి మాత్రమే కాకుండా ఏ మహిళకు అనడానికైనా అసహ్యంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా, సపోర్ట్ గా నిలబడతాను" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు చిరంజీవి.

దీంతో చిరు చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్ కి లియోలో త్రిషతో కలిసి నటించడంపై ఎలా అనిపించింది అనే ప్రశ్న ఎదురవ్వగా దానికి మన్సూర్ అలీ బదులిస్తూ.." సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుంది అనుకున్నా. నేను గతంలో చాలా రేప్ సీన్స్ చేశాను. త్రిషతో బెడ్ రూమ్ సీన్ మిస్ అయిపోయాను" అంటూ వల్గర్ కామెంట్స్ చేశాడు.

దాంతో ఆయన చేసిన కామెంట్స్ పై సినీ ప్రముఖులతో పాటు నెటిజన్స్ సైతం మండిపడ్డారు. ఇక ఇష్యూ పై త్రిష వెంటనే స్పందిస్తూ.." ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోనందుకు ఆనందంగా ఉంది. ఇకపై జీవితంలో అతనితో నటించను. మానవజాతికి మన్సూర్ అలీ ఖాన్ అవమానం" అంటూ ట్వీట్ చేసింది.

కాగా ఇప్పటికే ఈ వివాదంపై లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్జ్ సీనియర్ నటి కుష్బూ, సింగర్ చిన్మయి, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, సీనియర్ నటి రోజా, హీరో నితిన్ సహా పలువురు స్పందిస్తూ త్రిషకి మద్దతుగా నిలిచారు.