Begin typing your search above and press return to search.

త్రిషకి విశ్వంభర చిరు బహుమానం

చిరంజీవి తో సినిమా మొదలు అయినప్పటి నుంచి కూడా త్రిష పలు ఆసక్తికర విషయాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంది.

By:  Tupaki Desk   |   11 March 2024 5:13 AM GMT
త్రిషకి విశ్వంభర చిరు బహుమానం
X

మెగా స్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సోషియో ఫాంటసీ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ స్టార్‌ హీరోయిన్‌ త్రిష నటిస్తోంది. ఈ అమ్మడు చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ తో కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే.


చిరంజీవి తో సినిమా మొదలు అయినప్పటి నుంచి కూడా త్రిష పలు ఆసక్తికర విషయాలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంది. ఈ సినిమాలో త్రిష ద్విపాత్రాభినయం అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే తాజాగా త్రిష సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గత కొన్ని రోజులుగా విశ్వంభర సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న త్రిష కు మెగాస్టార్ చిరంజీవి నుంచి చిరు బహుమానం అందింది. ఆ విషయాన్ని త్రిష సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. చిరు సర్‌ తనకు టెంపరేచర్‌ కంట్రోల్డ్ మగ్ ని బహుమానంగా ఇచ్చారంటూ తెలియజేసింది.

చిరు ఇచ్చిన అరుదైన ఫ్యాన్సీ మగ్ ను త్రిష సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. చిరంజీవి ఇలా తనతో నటించే నటీ నటులకు అప్పుడప్పుడు ఇలాంటి బహుమానాలు ఇచ్చి సర్‌ ప్రైజ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈసారి త్రిష వంతు వచ్చింది.

ఇక చిరు విశ్వంభర సినిమా విషయానికి వస్తే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్‌ తో ఈ సినిమా రూపొందుతోంది. చాలా కాలం తర్వాత చిరు నుంచి రాబోతున్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. ఇందులో చిరుకు ఐదుగురు చెల్లెలు ఉంటారని సమాచారం. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవ్వబోతుంది.