Begin typing your search above and press return to search.

విశ్వంభ‌ర అప్పుడే అందుకున్నాడా?

ఈ పాట‌ని నృత్య ద‌ర్శ‌కురాలు శోభి ఆశ్వ‌ర్యంలో తెర‌కెక్కిస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 6:50 AM GMT
విశ్వంభ‌ర అప్పుడే అందుకున్నాడా?
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా విశ‌ష్ట ద‌ర్శ‌క‌త్వంలో `విశ్వంభ‌ర` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే చిరంజీవి ఆమెరికా ప్ర‌యాణం ముగించుకుని రావ‌డంతో కొత్త షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆట పాట‌తో స‌ర‌దాగా జ‌రుగుతున్నట్లు తెలిసింది. హైద‌రాబాద్ శివార్ల‌లో ప్ర‌త్యేక‌మైన వేసిన సెట్ లో చిరంజీవిపై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట‌ని నృత్య ద‌ర్శ‌కురాలు శోభి ఆశ్వ‌ర్యంలో తెర‌కెక్కిస్తున్నారు.

ఇందులో చిరంజీవి మార్క్ సిగ్నెచ‌ర్ స్టెపులు ఉండ‌బోతున్నాయ‌ట‌. ఈ పాట సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ గానూ నిలుస్తుంద‌ని స‌మాచారం. అయితే టాకీ పార్ట్ పూర్తికాకుండా పాట‌ల షూటింగ్ ఏంటి? అనే సందేహం తెర‌పైకి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో ఆ పాట చిత్రీక‌ర‌ణ‌కు-టాకీ పార్ట్ కి లింక్ ఉండ‌టంతో? ఆ పాట‌ని చిత్రీకరిస్తున్న‌ట్లు తెలిసింది. స్టోరీలో భాగంగా ఆపాట వ‌స్తుందిట‌. ఆ పాట తో పాటు షూట్ చేయాల్సిన స‌న్నివే శాలు కూడా కొన్ని ఉన్నాయ‌ట‌.

దీనిలో భాగంగానే రెగ్యుల‌ర్ షూట్ తో పాటు పాట చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ పాట‌లో త్రిష పాల్గొంటుందా? మిగ‌తా భామ‌లు ఇషా చావ్లా...సుర‌భి ఉన్నారా? అన్న‌ది మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. కేవ‌లం చిరంజీవిపైనే షూట్ చేస్తున్న‌ట్లు వెలుగులోకి వ‌స్తోంది. ఇందులో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబు పాత్ర పోషిస్తున్న‌ట్లు ఇప్పటికే ప్ర‌చారం లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ పాత్ర ఆద్యంత వినోదాత్మ‌కంగా సాగుతుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో చిరంజీవికి మ‌రో రోల్ కూడా ఉందా? అన్న సందేహం మొద‌లైంది.

మ‌రి వీట‌న్నింటిపై క్లారిటీ రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. ఈ చిత్రాన్ని సోషియా పాంట‌సీ చిత్రంగా వశిష్ట తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుంది. చిరంజీవి కంబ్యాక్ అయిన ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న‌తో యూవీ సంస్థ సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. అది ఈ సినిమాతో కుదిరింది. ఈ చిత్రాన్ని అన్ని ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్నారు.