Begin typing your search above and press return to search.

చిరంజీవి పై కెమెరా మ్యాన్ వింత కామెంట్!

ఎంతో వైభ‌వంగా అయోధ్య‌లోని రామమందిరం ప్రాణ‌ప్ర‌తిష్ట జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Jan 2024 11:05 AM GMT
చిరంజీవి పై కెమెరా మ్యాన్ వింత కామెంట్!
X

ఎంతో వైభ‌వంగా అయోధ్య‌లోని రామమందిరం ప్రాణ‌ప్ర‌తిష్ట జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ అరుదైన మ‌హోత్త‌ర కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానిదంటూ ఎవ్వ‌రూ లేరు. సీని..రాజ‌కీయ‌..పారిశ్రామిక రంగాల‌కు చెందిన ఎంతో మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇక అయోధ్య భ‌క్తుల దాకిడితోనూ కిక్కిరిసింది. దేశంలో అనేక చోట్ల నుంచి ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లి రావ‌డంతో వేడుక ఎంతో వైభ‌వంగా జ‌రుగుతుందో అద్దం ప‌డుతుంది.

తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి తండ్రి త‌న‌యులు చిరంజీవి...రామ్ చ‌ర‌ణ్ హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రామ‌మందిర ప‌రిస‌రాల్లో ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. అక్క‌డంతా హ‌డావుడిగా ఉన్న స‌మ‌యంలో చిరంజీవి-అనీల్ అంబానీ తార‌సప‌డ‌టంతో ఒక‌ర్నీ ఒకరు ప‌ల‌కరించుకున్నారు. స్పాట్ లో చిరంజీవి అంబానీతో చాలా సేపు మాట్లాడారు. ఆ ప‌క్క‌నే రామ్ చ‌ర‌ణ్ కూడా ఉన్నారు.

ఈ ముగ్గుర్ని ఎన్నో కెమెరాలు క‌వ‌ర్ చేసాయి. అయితే అక్క‌డున్న మీడియా చిరంజీవిని ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేసింది. అలా ఫోక‌స్ చేయ‌డంపై కెమెరా మ్యాన్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. 'అక్క‌డ రామ్ చ‌ర‌ణ్ ఉన్నారు. ప‌క్క‌నుంది ఆయ‌న తండ్రి. అందుకే ప్రేమ్ లో పెట్టాం' అంటూ కెమెరా మ్యాన్ అన్నారు. ఈ వీడియో..ఆవ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ వీడియోని మెగా ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.

ఆ వ్యాఖ్య‌ల‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు ప‌డుతున్నాయి. కెమెరా మ్యాన్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి చిరంజీవి ఎవ‌రో ? ఆ కెమెరా మ్యాన్ కి తెలియ‌క అలా వ్యాఖ్యానించాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో చ‌ర‌ణ్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. బ‌హుశా ఆ కెమెరా మ్యాన్ కి ఈసినిమాతో చ‌ర‌ణ్ అంత‌గా ఫేమ‌స్ అవ్వ‌డంతోనే చ‌ర‌ణ్ తండ్రి కాబ‌ట్టే ఫోక‌స్ చేసాం అని వ్యాఖ్యానించి ఉండొచ్చు. అయినా చిరంజీవి లాంటి స్టార్ ని ఉద్దేశించి కెమెరా మ్యాన్ అర్దం లేని వ్యాఖ్య‌లు చేయ‌డంపై అభిమానులు మండిప‌డుతున్నారు.