ఫిట్‌నెస్‌కు మెయిన్ రీజన్ చెప్పిన మెగాస్టార్
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
By: Tupaki Desk | 10 Jun 2025 2:42 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వయసులో కూడా చిరంజీవి అంతటి గ్రేస్ తో డ్యాన్సులు వేయడాన్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు కాస్త లావైన చిరంజీవి తిరిగి సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చాక బాగా బరువు తగ్గి ఫిట్ నెస్ విషయంలో అందరికీ ఓ ఎగ్జాంపుల్ గా నిలిచారు.
అలాంటి చిరంజీవి తను ఫిట్ గా ఉండటానికి గల అతి పెద్ద సీక్రెట్ ను బయటపెట్టారు. యోగా వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయన్న మెగాస్టార్ తన సోషల్ మీడియాలో యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ ఓ పోస్ట్ చేశారు. యోగాను ప్రపంచానికి ఇండియా ఇచ్చిన గిఫ్ట్ గా చిరంజీవి పేర్కొన్నారు. జూన్ 21న యోగా దినోత్సవాన్ని అందరూ కలిసి జరుపుకోవాలని ఆయన కోరారు.
ఫోకస్ ద్వారా ఫిట్‌నెస్ పెరుగుతుందని, కానీ యోగా ఈ రెండింటినీ పెంచుతుందని, ఈ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే ను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని, ఇండియా ప్రపంచానికి యోగా రూపంలో ఓ గొప్ప బహుమతిని ఇచ్చిందని, బోర్డర్లను దాటి దాన్ని సెలబ్రేట్ చేసుకుందామని, శారీరక ధృఢత్వం, మానసిక ప్రశాంతత రెండింటినీ పెంపొందిచడంలో యోగా ఓ సమగ్రమైన మార్గమని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు.
యోగా మన ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరచడంలో ఎంతో సాయపడుతుంది కాబట్టి మన ఫిట్‌నెస్‌ను మెరుగు పరచుకోవడానికి గొప్ప స్టార్ట్ అవుతుందని ఆయన చెప్పారు. కాగా చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.