మెగాస్టార్ వర్సెస్ యంగ్ టైగర్ 2002 రిపీట్!
అయితే చిరు-తారక్ లు ఇలా తలపడటం ఇది రెండవసారి.
By: Tupaki Desk | 26 April 2025 6:51 AMమెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రం షూట్ కంటే ముందే రిలీజ్ కన్పమ్ చేసారు. 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. ఇలా సంక్రాంతిని టార్గెట్ చేయడం అనీల్ కి అలవాటు. తాజాగా చిరంజీవి కూడా తోడవ్వడంతో? సంక్రాంతి రిలీజ్ లో మొదటి చిత్రం ఇదే అవుతుందని తేలిపోయింది.
అయితే ఇదే సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా 'డ్రాగన్' రిలీజ్ కన్పమ్ చేసారు. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'డ్రాగన్' జనవరి రిలీజ్ తేదీగా లాక్ చేసారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ వర్సెస్ యంగ్ టైగర్ వార్ షురూ అయింది. అయితే చిరు-తారక్ లు ఇలా తలపడటం ఇది రెండవసారి. గతంలో 2002లో ఇద్దరు హీరోలగా నటించిన చిత్రాలు సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యాయి.
చిరంజీవి హీరోగా నటించిన 'ఇంద్ర' సినిమా కంటే ఐదు రోజుల ముందు ఎన్టీఆర్ నటించిన 'అల్లరి రాముడు' రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలకు ఒక్కరే డైరెక్టర్. అతడే బి.గోపాల్. సాధారణంగా రెండు సినిమాలకు ఒకే డైరెక్టర్ అయితే క్లాష్ రాకుండా చూసుకుంటారు. కానీ అప్పటి సమీకరణాల నేపథ్యంలో అనివార్య కారణాలతో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అలా చిరు-తారక్ మధ్య తొలిసారి క్లాష్ ఏర్పడింది. ఆ సీజన్ లో చిరంజీవిదే అప్పర్ హ్యాండ్ అయింది. అప్పట్లో 'ఇంద్ర' ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. చిరంజీవి కెరీర్ లో మరో మైలు రాయిగా నిలిచిపోయింది.
'అల్లరి రాముడు' మాత్రం బిలో యావరేజ్ గా ఆడింది. కానీ నేడు పరిస్థితి వేరు 2026 లో బిగ్ వార్ తప్పదు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో . చిరంజీవి మాత్రం రీజనల్ మార్కెట్ లో నే పోటీలో ఉన్నారు. కానీ బ్లాక్ బస్టర్ అయితే మెగా దూకుడు మామలుగా ఉండదు. దీంతో రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ చిరు-తారక్ మధ్య బాక్సాఫీస్ వద్ద వార్ షురూ అయింది.