Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌తో పోటీకి బాల‌య్య సై

ఈ మూవీని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్నారు. షూటింగ్‌కు ముందే రిలీజ్ టైమ్‌ని ప్ర‌క‌టించేసింది.

By:  Tupaki Desk   |   10 May 2025 8:30 AM
మెగాస్టార్‌తో పోటీకి బాల‌య్య సై
X

టాలీవుడ్ స్టార్ల‌కు సంక్రాంతి సెంటిమెంట్ ఉన్న విష‌యం తెలిసిందే. చాలా మంది క్రేజీ స్టార్లు, సీనియ‌ర్ హీరోలు సంక్రాంతికి బ‌రిలో దిగాల‌ని పోటీప‌డుతుంటారు. అనుకున్న విధంగా స‌క్సెస్ సాధించి సెంటిమెంట్‌గా మార్చుకోవ‌డం తెలిసిందే. 2023లో సంక్రాంతి బ‌రిలో పోటీకి దిగి స‌క్సెస్ అందుకున్న సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ మ‌రో సారి 2026 సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. అయితే ఈ సారి కూడా బాల‌య్య మ‌రో సీనియ‌ర్ స్టార్ మెగాస్టార్‌తో పోటీకి దిగ‌బోతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీర‌య్య‌' మూవీతో బ‌రిలో నిలిచారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించగా బాబి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. అదే సంక్రాంతికి నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 'వీర సింహారెడ్డి' విడుద‌లైంది. క‌న్న‌డ మూవీ స్ఫూర్తితో తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కాలేదు కానీ ఫ‌ర‌వాలేద‌నిపించింది. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే రివేంజ్ డ్రామాగా గోపీచంద్ మ‌లినేని రూపొందించిన ఈ మూవీ సంక్రాంతి సినిమాల్లో ఫ‌ర‌వాలేదు అనిపించిందే కానీ బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకోలేక‌పోయింది.

2023 సంక్రాంతి బ‌రిలో మెగాస్టార్ 'వాల్తేరు వీర‌య్య‌' పై చేయి సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. అయితే 2023 త‌రువాత మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి సంక్రాంతి స‌మ‌రానికి సై అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభ‌ర‌'లో న‌టిస్తున్నారు. యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ట డైరెక్ష‌న్‌లో సోషియో ఫాంట‌సీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీని త‌రువాత చిరు క్రేజీ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం తెలిసిందే.

ఈ మూవీని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్నారు. షూటింగ్‌కు ముందే రిలీజ్ టైమ్‌ని ప్ర‌క‌టించేసింది. దీనికి పోటీగా మ‌రోసారి బాల‌య్య సంక్రాంతి బ‌రిలోకి దిగుతున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో 'అఖండ‌' సీక్వెల్ 'అఖండ 2'లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. అంటే రెండేళ్ల త‌రువాత మ‌రోసారి మెగాస్టార్, బాల‌య్య పోటీప‌డ‌బోతున్నార‌న్న మాట. అదే నిజ‌మైతే వ‌చ్చే ఏడాది సంక్రాంతికి మ‌రోసారి చిరు, బాల‌య్య‌లు పోటీప‌డ‌టం అనివార్య‌మే.