విశ్వంభర వెనకడుగు దేనికి..?
విశ్వంభర సినిమా కథలో గ్రాఫిక్స్ కూడా భాగం కాబట్టి ఈ సినిమాను విజువల్స్ పరంగా ది బెస్ట్ ఉండేలా చూస్తున్నారు.
By: Tupaki Desk | 29 May 2025 2:30 AMమెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ ఎప్పుడు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కి ఉన్న అతి పెద్ద డౌట్ ఇదే. ఈ ఏడాది సంక్రాంతికే సినిమాను తీసుకొచ్చే ప్లాన్ చేసిన మేకర్స్ సడెన్ గా చరణ్ మూవీ కోసం వాయిదా వేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అది ఓకే అనుకున్న ఫ్యాన్స్ కి సినిమా రిలీజ్ డేట్ విషయంలో దర్శక నిర్మాతలు చేస్తున్న ఆలస్యం చూస్తుంటే మరింత డౌట్ పెరుగుతుంది. బింబిసార సినిమాతో మెప్పించిన వశిష్ఠ చెప్పిన కథ నచ్చడంతో విశ్వంభర ఫిక్స్ చేసుకున్నాడు చిరంజీవి.
సినిమా అనౌన్స్ మెంట్ వీడియోతో ఆసక్తి కలిగేలా చేసినా గ్రాఫిక్స్ విషయంలో కాస్త శ్రద్ధ వహించాల్సిందే అని ఆడియన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడానికి రీజన్ కూడా అదే అని అంటున్నారు. ఈమధ్య సీజీ వర్క్ విషయంలో సినీ ప్రియులంతా మంచి ఫోకస్ తో ఉన్నారు. సరైన వి.ఎఫ్.ఎక్స్ వర్క్ లేకపోతే మాత్రం తిప్పి కొడుతున్నారు. ఈమధ్య వచ్చిన చాలా సినిమాలకు అలాంటి రిజల్ట్ ఇచ్చారు.
విశ్వంభర సినిమా కథలో గ్రాఫిక్స్ కూడా భాగం కాబట్టి ఈ సినిమాను విజువల్స్ పరంగా ది బెస్ట్ ఉండేలా చూస్తున్నారు. ఐతే అది కాస్త అనుకున్న టైంలో పూర్తి చేయలేక రిలీజ్ ఎప్పుడన్నది చెప్పలేకపోతున్నారు. మరోపక్క సెట్స్ మీద ఉన్న సినిమాలు అన్నీ కూడా ఒక దాని వెంట మరొకటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ డేట్స్ లాక్ చేసుకుంటున్నాయి. వాటితో పాటు విశ్వంభర రిలీజ్ ఎప్పుడని తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
కానీ యువి క్రియేషన్స్ మాత్రం విశ్వంభర రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా డిక్లేర్ చేయలేదు. జూలై 22న రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. మరోపక్క చిరంజీవి బర్త్ డే కానుకగా విశ్వంభర రిలీజ్ చేస్తారంటూ చెబుతున్నారు. మరి విశ్వంభ్ర వెనకడుగు వేయకుండా త్వరగా రిలీజ్ అయితే చూడాలని మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. స్టార్ సినిమాలు ఇలా రిలీజ్ డేట్ ఎప్పుడన్న క్లారిటీ లేకపోతే ఫ్యాన్స్ లో టెన్షన్ కామనే. ఐతే మెగాస్టార్ విశ్వంభర సినిమా రిలీజ్ విషయంలో ఎప్పటికి క్లారిటీ వస్తుంది అన్నది చూడాలి. విశ్వంభర సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ లు కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు.