విశ్వంభర రిలీజ్ నెలాఖరుకా?
'విశ్వంభర' రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేని సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ ప్రకటించిన సినిమా ఇప్పటి వరకూ మరో రిలీజ్ తేదిని ప్రకటించకపోడంతో? రిలీజ్ ఎప్పుడు అనే ఒత్తిడి మేకర్స్ మీద మొదలైంది.
By: Tupaki Desk | 23 May 2025 10:30 AM'విశ్వంభర' రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేని సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ ప్రకటించిన సినిమా ఇప్పటి వరకూ మరో రిలీజ్ తేదిని ప్రకటించకపోడంతో? రిలీజ్ ఎప్పుడు అనే ఒత్తిడి మేకర్స్ మీద మొదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కారణంగా రిలీజ్ వాయిదా పడుతుందనే విషయం వెలుగులోకి వచ్చినా? ఆ పనులు ఎంతకీ ముగింపు వచ్చినట్లు కనిపించలేదు. సంక్రాతి గడిచి ఐదు నెలలవుతుంది.
అప్పటి నుంచి పెండింగ్ షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. నేటికి కూడా పోస్ట్ ప్రొడక్షన్ ఎంత వరకూ పూర్తయిందన్నది క్లారిటీ లేదు. దీంతో రిలీజ్ తేదీపై ఆసక్తి సన్నగిల్లుతుంది. జూన్..జూలై ..ఆగస్టు అంటూ ప్రచారం జరుగుతుంది . మరోవైపు దసరా సందర్భంగా అక్టోబర్ లో రిలీజ్ అవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ తేదిపై స్పష్టత వచ్చేదెప్పుడు? అంటే ఈ నెలఖరుకల్లా మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాల నుంచి లీకైంది.
ఏ నెలలో రిలీజ్ చేస్తారన్నది తేదీతో సహా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పే అవకాశం ఉందంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఓకొలిక్కి వచ్చాయంటున్నారు. మరి ఇందులో నిజమెంత? అన్నది మేకర్స్ ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు చిరంజీవి కొత్త సినిమా పనుల్లో బిజీ అవ్వడానికి రెడీ అవుతున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న 157వ సినిమా కోసం మెగాస్టార్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో సెట్స్ లో కాలు పెట్టడానికి రెడీ అవుతున్నారు.
చాలా కాలం తర్వాత చిరంజీవి నటించబోతున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో బాస్ అంత ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. ఈ నేపథ్యంలో 'విశ్వంభర'కు సంబంధించి అన్ని పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయనా సిద్దంగా ఉన్నారు. రిలీజ్ తేదీని పట్టి ప్రచారం పనులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.