Begin typing your search above and press return to search.

'విశ్వంభర' వరల్డ్.. రూ.75 కోట్లతో ఆ వర్క్ వేరే లెవెల్ లో!

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభర.. ఇప్పుడు తుదిమెరుగులు దిద్దుకుంటున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 April 2025 5:11 PM
Chiranjeevi Viswambhara VFX Spectacle in the Making
X

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభర.. ఇప్పుడు తుదిమెరుగులు దిద్దుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రియులు, అభిమానులు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నిజానికి సంక్రాంతికే విశ్వంభర విడుదల కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల మేకర్స్ వాయిదా వేశారు. ఇంకా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు.

అయితే జులై 24వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం బ్లాక్ బస్టర్ హిట్ ఇంద్ర.. ఆరోజే విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో విశ్వంభరను రిలీజ్ చేయనున్నారని సమాచారం. మరికొద్ది రోజుల్లో విడుదల తేదీపై అనౌన్స్ చేయనున్నారట.

ఇక చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సోషియో ఫాంటసీ జోనర్ మూవీలో చిరు నటిస్తుండడంతో ఆడియన్స్ తోపాటు మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీపై మంచి హోప్సే పెట్టుకున్నారు. కానీ కొన్ని నెలల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ విషయంలో చాలా కామెంట్స్ వచ్చాయి.

వీఎఫ్ ఎక్స్ వర్క్ బాగోలేదని అనేక మంది అభిప్రాయపడ్డారు. దీంతో మేకర్స్ వెంటనే నష్టనివారణ చర్యలకు దిగినట్లు టాక్ వినిపించింది. అందుకు గాను స్పెషల్ ప్లాన్ వేసుకున్నారని తెలిసింది. ఇప్పుడు వీఎఫ్ ఎక్స్ కోసం మేకర్స్ మొత్తం రూ.75 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. నెవ్వర్ బిఫోర్ అనేలా విశ్వంభర వరల్డ్ ను చూపించనున్నారని టాక్.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ విజువల్స్ వండర్ గా చూపించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని సమాచారం. అందుకోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో ఈగర్ గా మూవీ కోసం వెయిట్ చేస్తున్నామని అంతా అంటున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంభరలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీ, విక్రమ్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి విశ్వంభర ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.