విశ్వంభర: ఆ ఫెస్టివల్ రేస్‌లోకి మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి, బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్‌లో వస్తున్న విశ్వంభర మూవీపై ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో భారీ అంచనాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 4 July 2025 4:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి, బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్‌లో వస్తున్న విశ్వంభర మూవీపై ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో భారీ అంచనాలు ఉన్నాయి. సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, గ్రాఫిక్స్ విజువల్స్ పరంగా పాన్ ఇండియా లెవెల్ స్థాయిని టార్గెట్ చేస్తూ దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నాడు. ఇది మైథాలజీ, ఫ్యాక్షన్, డెవోషనల్, విజువల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపిన ఒక గ్రాండ్ సినిమా అనిపిస్తోంది.
అయితే ఈ సినిమా విడుదల తేదీపై నెలలుగా నాన్చిన సందిగ్ధతకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని ఫిలింనగర్ టాక్. ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా.. వీఎఫ్ఎక్స్ డిలే, ఆ తర్వాత చిరు మరో సినిమా షూటింగ్ లకు వెళ్లడం వల్ల టైం కన్‌జ్యూమ్ అయింది. చివరకు ఇప్పుడు సెప్టెంబర్ 18న దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారని సమాచారం. అయితే ఇదే నెల 25న పవన్ కళ్యాణ్ OG రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అన్నయ్య కోసం తమ్ముడు కాస్త గ్యాప్ తీసుకునే అవకాశం లేకపోలేదు.
ఇక విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. కేవలం ఓ స్పెషల్ సాంగ్ మిగిలి ఉంది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు తుది దశకు చేరగా.. థియేట్రికల్ డీల్స్, ప్రమోషన్ ప్లాన్లు అన్నీ ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జూలైలో ఈ కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కోసం కూడా జాగ్రత్తగా ప్రణాళిక రూపొందిస్తున్నారట.
ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. థియేట్రికల్ బిజినెస్ విషయంలో కూడా UV క్రియేషన్స్ మంచి రేట్స్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఆడియో, బీజీఎం డిపార్ట్‌మెంట్‌లో మ్యూజిక్ మాస్ట్రో కీరవాణి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ రెడీగా ఉన్నాయనీ, ట్రైలర్‌తో పాటు పాటల ప్రొమోషన్స్ కూడా త్వరలో ప్రారంభం కానున్నాయంటున్నారు.
విశ్వంభరపై తొలుత వచ్చిన బజ్‌ను మళ్లీ తీసుకురావడమే ఇప్పుడు టీమ్ టార్గెట్. టీజర్‌కు నెగటివ్ రెస్పాన్స్ వచ్చినా.. మేకర్స్ ఎక్కడా తడబాటు లేకుండా తమ ప్రొడక్ట్‌పై నమ్మకంగా ఉన్నారని అంటున్నారు. ఈసారి మెగాస్టార్ మాస్ యాక్షన్ కన్నా, సోషియో మేసేజ్, గ్రాఫిక్స్ వర్షంతో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారట. మరి ఇప్పుడైనా అనుకున్న సమయానికి సినిమాను దించుతారో లేదో చూడాలి.
