Begin typing your search above and press return to search.

చిరు 'విశ్వంభర' స్టోరీ ఇదే!

ఒక్క సాంగ్, రెండు రోజుల ప్యాచప్ వర్క్ తప్ప మిగతా సినిమా అంతా కంప్లీట్ అయిందని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   18 July 2025 9:56 AM IST
చిరు విశ్వంభర స్టోరీ ఇదే!
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న మూవీ విశ్వంభర. సోషియో ఫాంటసీ జోనర్ లో యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. కునాల్ కపూర్, ఆశిక రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

అయితే విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. ప్రపంచ స్థాయి వీఎఫ్ ఎక్స్ పనుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ పనులయ్యాక, చిరు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక రిలీజ్ చేయమని ఇప్పటికే తేల్చి చెప్పినట్లు టాక్ వచ్చింది. ఇప్పుడు సీజీఐ వర్క్స్ దాదాపు పూర్తైయినట్లు తెలుస్తోంది.

చిరు ఇటీవల ఫైనల్ కట్ ను చూసిన థ్రిల్ అయ్యారని, టెక్నికల్ టీమ్ ను ప్రశంసించారని సమాచారం. రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వస్తోంది. దీంతో మేకర్స్.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారని చెప్పాలి. రీసెంట్ గా డైరెక్టర్ విశ్వంభర ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే వశిష్ట గత మూవీ బింబిసార అన్న విషయం తెలిసిందే. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు విశ్వంభరతో రానున్నారు. అలా బింబిసార, విశ్వంభర సౌండింగ్ ఒకేలా ఉండేలా టైటిల్ పెట్టారా అడగ్గా.. అలా ఏం లేదని వశిష్ట తెలిపారు. సినిమా బట్టి టైటిల్ పెట్టానని, కథ మొదలైనప్పుడే పెట్టేశానని చెప్పారు.

"మనకు ఉన్న 14 లోకాలను మనం చూశాం. వాటికి బేస్ గా మరో లోకం క్రియేట్ చేశాం. దానికి విశ్వంభర అని పేరు పెట్టాం. విశ్వాన్ని భరించేదాన్ని విశ్వంభర అంటారు. కరెక్ట్ గా సింక్ అయింది. చాగంటి కోటేశ్వరరావు సహా పలువురిని అడిగాం. వాళ్లు అదే అర్థం చెప్పారు. నారాయణరెడ్డి గారికి అప్పుడు అవార్డు వచ్చింది" అని తెలిపారు.

ఒక్క సాంగ్, రెండు రోజుల ప్యాచప్ వర్క్ తప్ప మిగతా సినిమా అంతా కంప్లీట్ అయిందని వెల్లడించారు. ఐదు లోకాలు క్రియేట్ చేశామని, పంచభూతాల్లాంటివని చెప్పారు. హయ్యెస్ట్ వీఎఫ్ ఎక్స్ బేస్ట్ ఫిల్మ్ అని తెలిపారు. సినిమాలో ఉడుత, రెక్కల గుర్రం కీలక పాత్రలు పోషిస్తాయని, తండ్రీకొడుకుల ఎమోషన్ ఉందని పేర్కొన్నారు.

సినిమాలో చిరంజీవికి నాలుగేళ్ల కొడుకు ఉంటారని, అదే ఎమోషనల్ గా చూపించామని వశిష్ట తెలిపారు. అక్టోబర్ లో ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. మూవీలో త్రిష చాలా అందంగా, ఫ్రెష్ గా ఉంటారని.. ఆమె చుట్టూ సినిమా తిరుగుతుందని పేర్కొన్నారు. అయితే హీరోయిన్ కోసం హీరో విశ్వంభర లోకానికి వెళ్లడమే సినిమా స్టోరీ లైన్ అని కొందరు నెటిజన్లు ఇప్పుడు ఊహిస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో చూడాలి.