Begin typing your search above and press return to search.

విశ్వంభర వర్క్.. ఎంతవరకు వచ్చిందంటే?

మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఒక విభిన్నమైన ఫాంటసీ ప్రపంచంలో అడుగుపెడుతున్న చిత్రం ‘విశ్వంభర’.

By:  Tupaki Desk   |   22 May 2025 6:31 PM
విశ్వంభర వర్క్.. ఎంతవరకు వచ్చిందంటే?
X

మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఒక విభిన్నమైన ఫాంటసీ ప్రపంచంలో అడుగుపెడుతున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ పట్ల మొదటి పోస్టర్ నుంచి భారీ ఆసక్తి నెలకొంది. టీజర్, సాంగ్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, ప్రొడక్షన్ టిమ్ ఫోకస్‌ను పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పెట్టింది.

రీసెంట్ గా విడుదలైన ‘రామా రామా’ డేవోషనల్ మెలొడీకి మంచి స్పందన లభించడంతో మ్యూజిక్ పరంగా సినిమా స్థాయిని పెంచింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చిరంజీవి డాన్స్ మూమెంట్స్ ఈ పాటకు హైలైట్‌గా నిలిచాయి. ఇక ఈ చిత్రంలోని కథ, విజువల్స్, కాన్సెప్ట్ అన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నట్లు సమాచారం.

‘విశ్వంభర’లో త్రిష కథానాయికగా, అశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ విజువల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రత్యేకమైన సెట్‌లు, భారీ గ్రాఫిక్స్ వర్క్ ను వాడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా ఈ సినిమాను ప్రమోట్ చేసిన నిర్మాత విక్రమ్ కీలక విషయాలు వెల్లడించారు. “విశ్వంభర” సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ దాదాపుగా 90 శాతం పూర్తయినట్లు పేర్కొన్నారు.

భారీ స్థాయిలో హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. సినిమా అప్‌డేట్‌లపై అభిమానులు ఎదురుచూస్తున్న వేళ ఈ క్లారిటీతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా 70 కోట్ల బడ్జెట్‌ను గ్రాఫిక్స్‌పై మాత్రమే ఖర్చు చేస్తున్నారని సమాచారం.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో నడిచే ఈ కథ ద్వారా దర్శకుడు వశిష్ఠ మరోసారి తన మేజికల్ టచ్ చూపించనున్నాడు. చిరంజీవి మోడరన్ యుగంలో కనిపించనున్న ఈ పాత్రకు పూర్వ జన్మ మిస్టరీ కూడా ఉండబోతుందనే టాక్. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ తర్వాత ప్రమోషనల్ దశ మరింత వేగంగా సాగనుందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్‌తో పాటు ఇంటర్నేషనల్ లెవల్లో కూడా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫ్యాన్స్ భారీ స్థాయిలో సినిమా కోసం ఎదురు చూస్తుండగా, విజువల్ గ్రాండియర్ మైతాలజికల్ టచ్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టనుంది. 'విశ్వంభర' విడుదల తర్వాత చిరంజీవికి ఇది మరో క్లాసిక్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.