'విశ్వంభర' రిలీజ్ తేదీపై వశిష్ట క్లారిటీ ఇదే
తాజాగా రిలీజ్ తేదీపై దర్శకుడు విశిష్ట క్లారిటీ ఇచ్చారు. 'సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేసారు.
By: Tupaki Desk | 26 July 2025 7:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టాకీ సహా పాటల చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో మాత్రం రిలీజ్ తేదీపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆగస్టు లేదా? సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుం దని...ఆ రెండు కుదరకపోతే డిసెంబర్ అని వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో సరైన క్లారిటీ లేకుండా పోయింది.
తాజాగా రిలీజ్ తేదీపై దర్శకుడు విశిష్ట క్లారిటీ ఇచ్చారు. 'సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేసారు. నేను ఔట్ పుట్ చూసుకుని సంతృప్తి చెందిన తర్వాతే రిలీజ్ డేట్ లాక్ చేస్తాను. అంత వరకూ రిలీజ్ విషయంలో రాజీ పడేది లేదు. నేను, నిర్మాతలు క్లారిటీ తో ఉన్నాం. ఎవరో తొందర పెడుతున్నారని...ఇంకేవరో ఆరాట పడతారాని...నేను కంగారు పడి రిలీజ్ తేదీ వేసేస్తే ఆ పరిణామాలు వేరుగా ఉంటాయి. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నేను ఇచ్చేది పర్పెక్ట్ ఔట్ పుట్ క్వాలిటీ తో ఇవ్వాలి.
విఎఫ్ ఎక్స్, నేను అనుకున్న విజన్ కరెక్ట్ గా ఉందని నమ్మినప్పుడే రిలీజ్ తేదీ ఇస్తాను. ముందే డేట్ ఇచ్చే సి ఇక్కడ ఔట్ పుట్ సరిగ్గా రాక కిందా మీద పడి రిలీజ్ చేసి మార్కెట్ లో దెబ్బతినకూడదు. చిరంజీవి గారు నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. అదీ నా రెండవ సినిమాకే ఆయన అవకాశం అంటే ఎంతో గొప్పది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది' అని అన్నారు.
వశిష్ట మాటల్ని బట్టి సినిమాకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఆయనకు ఉంది. నిర్మాతల నుంచి గానీ, చిరం జీవి నుంచి గానీ రిలీజ్ ఆలస్యమవుతుందనే ఒత్తిడి ఎంత మాత్రం కనిపించలేదు. విడుదల ఆలస్యమైనా మెగా అభిమానులకు ఓ గొప్ప చిత్రాన్ని అందించాలి అన్న సంకల్పంతోనే వశిష్ట పనిచేస్తున్నారు. వశిష్ట తొలి సినిమా 'బింబిసార' పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.
