మెగా ఫ్యాన్స్ డిమాండ్ లో న్యాయముంది
గత కొన్ని సినిమాలుగా మెగాస్టార్ చిరంజీవి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి ఎంతో ఆచితూచి మరీ తన తర్వాతి సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చేయనున్నట్టు అనౌన్స్ చేశాడు.
By: Tupaki Desk | 6 Jun 2025 12:30 PMగత కొన్ని సినిమాలుగా మెగాస్టార్ చిరంజీవి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి ఎంతో ఆచితూచి మరీ తన తర్వాతి సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చేయనున్నట్టు అనౌన్స్ చేశాడు. అనౌన్స్‌మెంట్ తోనే విశ్వంభర సినిమా భారీ హైప్ ను క్రియేట్ చేసుకోవడంతో పాటూ మంచి అంచనాలను కూడా ఏర్పరచుకుంది.
చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా అని మెగా ఫ్యాన్స్ విశ్వంభర విషయంలో ఎంతో ఆశ పడ్డారు. వాస్తవానికైతే విశ్వంభర ఈ ఏడాది సంక్రాంతికే రిలీజవాల్సింది. కానీ గేమ్ ఛేంజర్ అప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో ఆ సినిమా కోసం విశ్వంభర సినిమాను వాయిదా వేశారు. ఆ తర్వాత మే 9న వస్తుందన్నారు.
అది కూడా జరగలేదు. దీంతో అసలు విశ్వంభర సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అనేది టాలీవుడ్ లో పెద్ద ప్రశ్నగా మారింది. మంచి హైప్ తో మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఈ విషయం ఫ్యాన్స్ ను తీవ్రంగా కలవరపెడుతుంది. దానికి కారణం మేకర్స్ ఇప్పటికీ విశ్వంభర రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడమే.
ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విశ్వంభర అప్డేట్స్ కోసం మేకర్స్ ను డిమాండ్ చేస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. విశ్వంభర ఓ గొప్ప విజువల్ స్పెక్టాక్యులర్ గా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ సినిమా అయినా చిరంజీవిని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. ఏదేమైనా ఎంతో కాలంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న ఈ డిమాండ్లలో న్యాయముంది.