మెగా సినిమాకు బజ్ లేదేంటి..?
విశ్వంభర సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చిరంజీవి ఇమేజ్ ని డ్యామేజ్ చేశాయి.
By: Tupaki Desk | 16 May 2025 3:45 PMమెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్స్ మీద ఉంటే ఫ్యాన్స్ లో ఒక ప్రత్యేకమైన డిస్కషన్.. సినిమా ప్రతి అప్డేట్ సోషల్ మీడియా హంగామా ఇదంతా ఉంటుంది. కానీ ఎందుకో ఏమిటో కానీ ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమాకు ఇదేమి జరగట్లేదు. వశిష్ట డైరెక్షన్ లో మెగాస్టార్ చేస్తున్న విశ్వంభర సినిమా విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు రాబోతుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి టైం చిరంజీవిని మళ్లీ గుర్తు చేసేలా వశిష్ట ఈ విశ్వంభరని తెరకెక్కిస్తున్నారని అంటున్నారు.
ఐతే ఎందుకో కానీ ఈ విశ్వంభర గురించి మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేయట్లేదు. అందులోనూ మెగా ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై అంత ఆసక్తి ఉన్నట్టు కనిపించట్లేదు. సినిమా నుంచి ఈమధ్యనే ఒక సాంగ్ కూడా రిలీజైంది. రామ పాట కాబట్టి శ్రోతలను అలరించింది. ఐతే ఆ సాంగ్ కూడా మిలియన్ వ్యూస్ రాబడుతున్నా ఇంకా ఏదో మిస్ అయ్యింది అనిపించింది. మరోపక్క సినిమా నుంచి రావాల్సిన సరైన అప్డేట్స్ రావట్లేదు అని ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.
విశ్వంభర సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చిరంజీవి ఇమేజ్ ని డ్యామేజ్ చేశాయి. మధ్యలో వాల్తేరు వీరయ్య కాస్త బెటర్ అనిపించినా మెగా ఫ్యాన్స్ ఆశలు నెరవేర్చేలా విశ్వంభర సినిమాతో వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఐతే విశ్వంభర మేకర్స్ ఈ లో ప్రొఫైల్ మెయిన్ టైనెన్స్ కావాలనే చేస్తున్నారన్న వాదన ఉంది.
ఎందుకంటే మేకర్స్ ఒకేసారి రిలీజ్ ముందు ప్రమోషన్స్ చేస్ థియేటర్ లో ఆడియన్స్ ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయాలని చూస్తున్నారు. అది కచ్చితంగా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. వశిష్ట కూడా మెగాస్టార్ సినిమా ఛాన్స్ ని నిలబెట్టుకునేందుకే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు కానీ చిరంజీవి పుట్టినరోజు కానుకగా విశ్వంభర వదిలితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఈషా చావ్లా, ఆషిక రంగనాథ్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.