Begin typing your search above and press return to search.

వాట్వే 'మెగా' మూమెంట్.. ఒకే ఫ్రేమ్ లో చిరు, విజయ్ టీమ్స్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తమ అప్ కమింగ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Sept 2025 2:52 PM IST
వాట్వే మెగా మూమెంట్.. ఒకే ఫ్రేమ్ లో చిరు, విజయ్ టీమ్స్!
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తమ అప్ కమింగ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్స్ షెడ్యూల్స్ లో పాల్గొంటూ కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా ఇరువురు ప్రముఖ హీరోలు తమ మూవీ టీమ్స్ తో కలుసుకున్నారు. దీంతో అదిరిపోయే మెగా మూమెంట్ చోటు చేసుకుంది.

ఓవైపు.. చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు మూవీతో బిజీగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో ప్రముఖ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పుడు మేకర్స్ ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ ఫిల్మ్ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.

మరోవైపు.. విజయ్ సేతుపతి ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో వర్క్ చేస్తున్నారు. ఛార్మీతో కలిసి పూరీ నిర్మిస్తున్న ఆ సినిమాలో సంయుక్త మీనన్, టబు సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో మేకర్స్ షూటింగ్ నిర్వహిస్తున్నారు. మూవీలోని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

అయితే చిరు- అనిల్ మూవీ, విజయ్- పూరీ సినిమా షూటింగ్స్ ఒకే స్టూడియోలో జరుగుతున్నాయి. దీంతో రెండు సినిమాల బృందాలు ఆత్మీయంగా కలుసుకున్నాయి. అంతా కలిసి సరదాగా పలకరించుకుని కబుర్లు చెప్పుకున్నారు. దీంతో బిజీ బిజీ షెడ్యూల్ మధ్య కూడా రెండు సినిమా బృందాలు హ్యాపీగా గడిపాయి.

అదే సమయంలో సెట్స్ లో ఆనందకరమైన వాతావరణం నెలకొంది. అందుకు సంబంధించిన పిక్స్ ను పూరీ- విజయ్ మూవీ మేకర్స్ షేర్ చేశారు. వాట్వే మెగా మూమెంట్.. చిరంజీవి మన శివశంకర వరప్రసాద్ గారు మూవీ టీమ్ ను సెట్స్‌ లో కలిసే గౌరవం పూరీ- సేతుపతి బృందానికి లభించిందంటూ నెట్టింట రాసుకొచ్చారు.

అయితే ఫోటోలో ఓవైపు.. చిరంజీవి సూట్ లో ఉండి అందరినీ ఆకట్టుకున్నారు. మరోవైపు.. విజయ్ సేతుపతి సంప్రదాయ లుంగీ లుక్ లో కూల్ గా సందడి చేశారు. ఇద్దరు స్టార్లు మాత్రమే కాకుండా నటీమణులు నయనతార, టబుతోపాటు దర్శకులు అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కూడా ఉన్నారు. అంతా నవ్వుతూ కనిపించారు.