చిరు-సూర్య మరో ఆలోచన లేకుండా!
పాన్ ఇండియా ఇమేజ్ కోసం హీరోలంతా ఎంతగానో కష్ట పడుతున్నారు. స్టోరీ ఎంపిక నుంచి అందులో పాత్రకు తగ్గట్టు మౌల్డ్ అవ్వడం కోసం రేయింబవళ్లు ఎంతో శ్రమిస్తున్నారు.
By: Srikanth Kontham | 6 Feb 2026 3:00 PM ISTపాన్ ఇండియా ఇమేజ్ కోసం హీరోలంతా ఎంతగానో కష్ట పడుతున్నారు. స్టోరీ ఎంపిక నుంచి అందులో పాత్రకు తగ్గట్టు మౌల్డ్ అవ్వడం కోసం రేయింబవళ్లు ఎంతో శ్రమిస్తున్నారు. యశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ లాంటి స్టార్లు పాన్ ఇండియా ఇమేజ్ అన్నది ఓవర్ నైట్ లో సాధించింది కాదు. దాని వెనుక ఎంతో కష్టముంది. ఎన్నో రకాల త్యాగాలు చేసి పాన్ ఇండియా స్టార్లగా ఎదిగారు. సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా `సైరా నరసింహారెడ్డి`తో ఓ పాన్ ఇండియా ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా కత్తియుద్దం , గుర్రపు స్వారీ నేర్చుకున్నారు.
పాత్ర కోసం రూపంలో ఎన్నో రకాల మార్పులు చేసారు. అందుకోసం ప్రత్యేక కసరత్తులు చేసారు. పిన్ టూ పిన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడా ప్రయత్న లోపం లేకుండా తాను పెట్టాల్సిన ఎఫెర్ట్ అంతా పెట్టి చేసారు. కానీ ఫలితమే నిరాశను మిగిల్చింది. దీంతో చిరంజీవి మళ్లీ మరో పాన్ ఇండియా ప్రయత్నం చేయలేదు. అప్పటి నుంచి రీజనల్ మార్కెట్ కే పరిమితమై పని చేస్తున్నారు. ఇదంతా ఐదేళ్ల క్రితం నాటి మాట. మరి చిరంజీవి మళ్లీ పాన్ ఇండియాలో ఆలోచనలో ఉన్నారా? అంటే మనసులోకి ఆ ఆలోచనే రానిస్తున్నట్లు కనిపించలేదు.
ప్రస్తుతం చిరంజీవి కమిట్ అవుతోన్న సినిమాలు..లైనప్ లో ఉన్న దర్శకుల్ని చూస్తే విషయం క్లియర్ గా అర్దమవుతుంది. ఇటీవలే `మన శంకర వరప్రసాద్ గారు`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి సినిమా బాబి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇతడు పాన్ ఇండియా డైరెక్టర్ కాదు. రీజనల్ మార్కెట్ ఫరిదిలో మంచి కమర్శియల్ డైరెక్టర్. అవి పాన్ ఇండియాలో వర్కౌట్ అవ్వవు. అలాగే `విశ్వంభర` అనే సోషియా ఫాంటసీ చిత్రంలోనూ చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాకు ఈ కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
కానీ రిలీజ్ పాన్ ఇండియాలో ఉంటుందా? ఉండదా? అన్న దానిపై సరైన క్లారిటీ లేదు. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య కూడా `కంగువ`తో తొలిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన సినిమా కోసం సూర్య చాలా ఎఫెర్ట్ పెట్టి పని చేసాడు. ప్రతీ ప్రేమ్ లోనూ సూర్య కష్టం కని పిస్తుంది. కానీ అది ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. ట్రీట్ మెంట్ సహా ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. దీంతో పాన్ ఇండియాలో `కంగువ` ఘోరం వైఫల్యంగా మిగిలిపోయింది. ఈ పరాజయం సూర్యను బాగా కృంగదీసింది. ఇప్పట్లో మరో పాన్ ఇండియా సినిమా చేయనని...రీజనల్ మార్కెట్ లోనే సినిమాలు చేస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం సూర్య లైనప్ అంతా రీజనల్ గానే ఉంది. సూర్య 46వ చిత్రంతో తెలుగులో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
