మెగాస్టార్ పై కొత్త దర్శకుడి ప్రయోగం..?
మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి సినిమా ఒప్పించడం అన్నది చాలా పెద్ద రిస్క్. 150 కి పైగా సినిమాలు చేసిన అనుభవం ఉన్న చిరంజీవి కథ వినగానే ఇది వర్క్ అవుట్ అవుతుందా లేదా అని ఇట్టే చెప్పగలడు.
By: Tupaki Desk | 2 May 2025 3:30 PMమెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి సినిమా ఒప్పించడం అన్నది చాలా పెద్ద రిస్క్. 150 కి పైగా సినిమాలు చేసిన అనుభవం ఉన్న చిరంజీవి కథ వినగానే ఇది వర్క్ అవుట్ అవుతుందా లేదా అని ఇట్టే చెప్పగలడు. కథ నచ్చినా కొన్ని విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఫ్యాన్స్ కి నచ్చేలా తన సినిమా ఉండాలని చూసే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫలితాలు ఎలా ఉన్నా తన వరకు ది బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత చిరంజీవి ఒక కొత్త దర్శకుడితో కలిసి సినిమా చేస్తున్నారు. కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ చెప్పిన కథకు చిరు ఓకే చెప్పారంటే ఆ కథ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నానితో దసరా సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెల తన సెకండ్ సినిమా కూడా నానితో చేస్తున్నాడు. ప్యారడైజ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ స్టేట్మెంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కచ్చితంగా నాని, శ్రీకాంత్ ఓదెల ఈ ఇద్దరు మరోసారి తమ మ్యాజిక్ చేస్తారని అనిపిస్తుంది.
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి శ్రీకాంత్ ఓదెల కాంబో కూడా గట్టి ప్లానింగ్ తోనే వస్తుందని తెలుస్తుంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా చిరంజీవి అభిమానే ఐతే హీరోగా ఆయన్ను అభిమానించడం ఆరాధించడం వేరు కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్లాక ఆయన ఒక స్టార్.. నేనొక దర్శకుడిని అనే ఉంటుందని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మిస్ అవుతున్న ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ని ఇంకా చిరు మాస్ స్టామినాని తెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.
మెగాస్టార్ తో సినిమా అంటే శ్రీకాంత్ రేంజ్ మారినట్టే లెక్క. చిరు సినిమా కన్నా ముందు ప్యారడైజ్ తో మరోసారి తన స్టామినా చూపించాలని చూస్తున్నాడు. మరి చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల ఎలా ఉంటుందో చూడాలి. మెగాస్టార్ పై శ్రీకాంత్ ఓదెల ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అన్నది చూడాలి. నాని నిర్మాతగా చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ అందించాలని చూస్తున్నారు.