Begin typing your search above and press return to search.

మెగా 158 కోసం చిరు హోమ్ వర్క్..?

విశ్వంభర తర్వాత మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడితో మెగా 157 సినిమా చేస్తున్నాడు. చిరు అనిల్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.

By:  Tupaki Desk   |   19 Jun 2025 9:45 AM IST
మెగా 158 కోసం చిరు హోమ్ వర్క్..?
X

విశ్వంభర తర్వాత మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడితో మెగా 157 సినిమా చేస్తున్నాడు. చిరు అనిల్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. మెగా 157 సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను కూడా అనిల్ రావిపూడి తన పంథాలో షూటింగ్ చేస్తున్నారు. మెగా 157 సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. రిలీజ్ టార్గెట్ పెట్టుకుని మరీ సినిమాను చేస్తున్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే మెగా 158 సినిమా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. దసరా సినిమాతో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన శ్రీకాంత్ ఓదెల రెండో సినిమా కూడా నానితో ప్యారడైజ్ అంటూ చేస్తున్నాడు. ఇక 3వ సినిమాగా మెగాస్టార్ చిరంజీవితో ఫిక్స్ అయ్యాడు. చిరంజీవి ఒక కథ ఓకే చేశాడంటే అది అంత సామాన్యమైన విషయం కాదు.

నాని నిర్మాతగా మెగాస్టార్ హీరోగా వస్తున్న సినిమాపై శ్రీకాంత్ ఓదెల వర్క్ బాగా కుదిరిందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో చిరంజీవి పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. మెగా 158 కోసం ఆఫ్టర్ లాంగ్ టైం చిరంజీవి హోమ్ వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ కాంబినేషన్ అనౌన్స్ మెంట్ తోనే బ్లడ్ బాత్ పోస్టర్ ని వదిలారు. సో సినిమా మెగా ఫ్యాన్స్ కి మెగా ఐ ఫీస్ట్ అందిస్తుందని చెప్పొచ్చు.

విశ్వంభర సినిమా రిలీజ్ అవ్వగానే అనిల్ సినిమా పనుల్లో బిజీ అవనున్న చిరంజీవి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మెగా 158 సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్యారడైజ్ రిలీజ్ వరకు మెగా 158 మొదలు పెట్టకపోయినా ఆ తర్వాత మాత్రం సినిమా రెగ్యులర్ షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 150కి పగా సినిమాల అనుభవం ఉన్న మెగాస్టార్ కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ తో జత కట్టడం మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈమధ్య సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. శ్రీకాంత్ కథ మొదటి సిట్టింగ్ లోనే ఓకే చేశారంటే కథలో ఎంత మ్యాటర్ ఉందన్నది అర్థం చేసుకోవచ్చు.