Begin typing your search above and press return to search.

డ్రిల్ మాస్టర్‌గా మెగాస్టార్ ఛాలెంజింగ్ లుక్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మెగా 157’ ప్రాజెక్ట్‌లో ఓ వైవిధ్యమైన పాత్రకు సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Desk   |   18 Jun 2025 9:59 AM
డ్రిల్ మాస్టర్‌గా మెగాస్టార్ ఛాలెంజింగ్ లుక్!
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మెగా 157’ ప్రాజెక్ట్‌లో ఓ వైవిధ్యమైన పాత్రకు సిద్ధమవుతున్నారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ దశలో ఉంది. కథా నిర్మాణం, తారాగణం, సాంకేతిక విభాగాల్లో ఈ సినిమా విశేషంగా ఆకట్టుకునేలా ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో చిరంజీవి వర ప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇది సాధారణ పాత్ర కాదు. స్కూల్‌ డ్రిల్ మాస్టర్ పాత్రలో మెగాస్టార్ నటనలో మరో కొత్త కోణాన్ని చూపించబోతున్నారు. చిరంజీవికి తగ్గట్టుగానే పాత్రలో ఒక మంచి స్టోరీ లైన్ అలాగే కామెడీ టైమింగ్ ఏమోషన్ డ్రామా కూడా ఉంటుందట. చిరంజీవి ‘మాస్టార్‌’ అని పిలిపించుకునే పాత్రలో రావడం చాలా సంవత్సరాల తర్వాత జరుగుతోంది. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ అంశాలతో కూడిన కథ ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ప్రస్తుతం ముస్సోలిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. స్కూల్ నేపథ్యంగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో డ్రిల్ మాస్టర్ పాత్రగా చిరంజీవి లుక్ ఎంతో స్పెషల్‌గా ఉండనుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో నయనతార, కేథరిన్ థెరిసా లు కూడా భాగం కానున్నారు. ముఖ్యంగా నయనతార, చిరంజీవి కాంబినేషన్ మరోసారి తెరపై కనువిందు చేయనుంది. ఇది ‘సైరా’, ‘గాడ్‌ఫాదర్’ తర్వాత వారి మూడో కాంబినేషన్ కావడం విశేషం.

ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్‌గా నబా కాంత్ మెతీ పని చేస్తున్నారు. ‘పెద్ది’ చిత్రంలో ఆయన రూపొందించిన క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇప్పుడు మెగాస్టార్ చిత్రంలోనూ అతని నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభ షెడ్యూల్‌లో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారని సమాచారం. చిరంజీవి మాస్ మేనరిజం, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ మిక్స్‌కి ఇది ఒక హై వోల్టేజ్ చిత్రంగా నిలవనుంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మెగా డాటర్ సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి నిర్మాణంలో ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఇప్పటికే మొదటి పాటపై పని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా 2026 సంక్రాంతి టైమ్ కి థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.