Begin typing your search above and press return to search.

డ్రిల్ మాస్టర్ గా చిరంజీవి కామెడీ పండిస్తారా?

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌ గా రూపొందుతున్న చిరు- రావిపూడి సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   14 July 2025 12:49 PM IST
డ్రిల్ మాస్టర్ గా చిరంజీవి కామెడీ పండిస్తారా?
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. కేథరిన్ ట్రెసా, గణేష్, బలగం మురళీధర్ ఇతర ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌ గా రూపొందుతున్న చిరు- రావిపూడి సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఒక్కో అప్డేట్ లేదా రూమర్.. మూవీపై ఓ రేంజ్ లో ఉన్న అంచనాలను ఇంకా పెంచుతున్నాయి. దీంతో సినిమా కోసం అటు ఫ్యాన్స్.. ఇటు మూవీ లవర్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో మేకర్స్ ఇస్తున్న అప్డేట్స్.. అనిల్ రావిపూడి ఇస్తున్న ఇంటర్వ్యూలతో సినిమా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే సినిమాలో మెగాస్టార్ తన అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ పేరుతో ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇప్పుడు మూవీలో చిరు డ్రిల్ మాస్టర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. చిరు కామెడీ టైమింగ్ తోపాటు ఆయన యాక్టింగ్.. హైలెట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ విషయం వైరల్ గా మారింది. డ్రిల్ మాస్టర్ గా చిరంజీవి కామెడీ పండిస్తున్నారన్నమాట అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇటీవల ముస్సోరిలో మేకర్స్ కీలక సీన్లు షూట్ చేయగా, ఇప్పుడు హైదరాబాద్‌ లో శరవేగంగా చిత్రీకరణ నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 22న చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు టైటిల్ అఫీషియల్ అనౌన్స్మెంట్‌ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నారని సమాచారం.

అందుకు గాను భారీ వేడుక ఏర్పాటు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో మన శంకర్ వరప్రసాద్ గారు.. అనే డిఫరెంట్ టైటిల్‌ ను ఫిక్స్ చేశారని వినికిడి. సంక్రాంతి రిలీజ్ కావడంతో పండుగ నేపథ్యానికి తగ్గట్టుగా టైటిల్ పెడతారని టాక్ వచ్చినా.. ఇప్పుడు ఇలా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సినిమాపై షూటింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి బజ్ క్రియేట్ అవుతూనే ఉంది. మరి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.