చిరుని మెప్పించని ఆస్కార్ అవార్డ్ విన్నర్!
అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా వేయడానికి ప్రధాన కారణం గ్రాఫిక్స్ వర్క్ కాదని, ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి కారణమని తెలిసింది.
By: Tupaki Desk | 10 April 2025 5:24 AMమెగాస్టార్ చిరంజీవి యంగ్ స్టార్స్‌కి గట్టి పోటీ నిస్తూ బ్యాక్‌టు బ్యాక్ క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. `భోళా శంకర్`తో భారీ డిజాస్టర్‌ని ఎదుర్కొన్న మెగాస్టార్ ఈ సారి భారీ విజయంతో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే యంగ్ డైరెక్టర్లతో వరుస ప్రాజెక్ట్‌లని ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ఆయన మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇప్పటికే ఓ ప్రాజెక్ట్‌ని దాదాపుగా పూర్తి చేయడం తెలిసిందే.
చిరు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్, బింబిసార` ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ డ్రామా `విశ్వంభర`ని తెరకెక్కిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈమూవీలో చిరుకు జోడీగా త్రిష, అషికా రంగనాథ్ నటిస్తున్నారు. 70 శాతం గ్రాఫిక్స్‌తో రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్ విషయంలో టీమ్ తర్జన భర్జన పడుతూ వస్తోంది. దానికి కారణం ఈ మూవీ గ్రాఫిక్స్ అనుకున్న స్థాయిలో రాకపోవడమే. ఫస్ట్ గ్లింప్స్‌పై విమర్శలు తలెత్తడంతో టీమ్ ఆ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేస్తోంది.
ముందు ఈ మూవీని ఈ ఏడాది జనవరికి సంక్రాంతి బరిలో నిలపాలని టీమ్ భావించింది. కానీ కుదరకపోవడంతో వాయిదా వేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా వేయడానికి ప్రధాన కారణం గ్రాఫిక్స్ వర్క్ కాదని, ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి కారణమని తెలిసింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం ఓ స్పెషల్ సాంగ్‌ని ప్లాన్ చేశారట. దానికి ఆయన అందించిన ట్యూన్స్ చిరుకు పెద్దగా నచ్చలేదట. దీంతో కీరవాణిని మరో ట్యూన్ రెడీ చేయమని చెప్పారట.
ఆ కారణంగా ఈ సినిమా షూటింగ్, రిలీజ్ ఆలస్యం అవుతోందని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం కీరవాణి కొత్త ట్యూన్‌ని రెడీ చేసే పనిలో ఉన్నారట. ఈ పాటలో చిరు ఓ రేంజ్‌లో మాస్‌స్టెప్పులతో అదరగొట్టబోతున్నారని, ఫ్యాన్స్‌కి ఈ పాట ఓ ఫీస్ట్‌లా ఉంటుందని, ఆ కారణంగానే మ్యూజిక్ విషయంలో చిరు కాంప్రమైజ్‌కావడం లేదని, అందుకే కీరవాణి చేసిన ట్యూన్‌ని రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మూవీ తరువాత మెగాస్టార్ రెండు భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. ప్రస్తుతం నానితో `ది ప్యారడైజ్`ని తెరకెక్కిస్తున్న శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా, అనిల్ రావిపూడితో మరో సినిమా చేయబోతున్నారు.