రాజమౌళితో మూవీ?.. చిరు ఏమన్నారంటే..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 April 2025 7:33 PM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా.. మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ ఓదెలతో మూవీని అనౌన్స్ చేశారు చిరు.
అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఆ సినిమాను నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. ఇంకా సెట్స్ పైకి మూవీ వెళ్లకపోయినా.. బజ్ మాత్రం నెలకొంది. రీసెంట్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకు రాజమౌళి, చిరు కాంబినేషన్ లో మూవీ రాలేదన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఓ ప్రాజెక్ట్ అనుకున్నారని, ఆ తర్వాత మిస్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ అది నిజమో కాదో తెలియదు. అదే సమయంలో జక్కన్నతో వర్క్ చేయడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరు రెస్పాండ్ అయ్యారు. షాకింగ్ కామెంట్స్ చేశారు.
కొన్నేళ్లపాటు సాగే రాజమౌళి మేకింగ్ ప్రాసెస్ తనకు సెట్ అవ్వదని చిరంజీవి తెలిపారు. జక్కన్న తీసుకున్న టైమ్ ను తాను మేనేజ్ చేయగలనో లేదో డౌట్ అని చెప్పారు. ఆయన కొన్ని ప్రాజెక్టులకు 4 నుంచి 5 ఏళ్ల వరకు గడుపుతారని అన్నారు. అదే సమయంలో తాను ఒకేసారి పలు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నానని పేర్కొన్నారు.
అందుకే తాను ఒక మూవీకి 3 నుంచి ౪ సంవత్సరాలు కేటాయించడం సెట్ అవ్వదని చిరు చెప్పారు. రాజమౌళితో కలిసి పనిచేయడం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలా తనకు ఇష్టం లేదని, ఏదైనా ఇప్పుడు రాజమౌళితో వర్క్ చేయాలనుకోవడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే చిరు కామెంట్స్ నిజమనే చెప్పాలి. రాజమౌళి తన ప్రతి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు.. చిరు ఓ సినిమా పూర్తవ్వగానే మరో మూవీని పట్టాలెక్కిస్తుంటారు. కాబట్టి అలా లాంగ్ టైమ్ షూటింగ్ ప్రాసెస్ కు చిరు ఓకే చెప్పడం ఆయనకు కష్టమే. అందుకే జక్కన్నతో వర్క్ చేయనని చెప్పినట్లు ఉన్నారు.
