Begin typing your search above and press return to search.

రీ రిలీజ్ కోసం మెగా బాస్ దిగారంటే..!

స్టార్ సినిమాలు రీ రిలీజ్ అవ్వడం కామన్ కానీ ఒక సినిమా రీ రిలీజ్ కోసం ఆ సినిమా హీరో, డైరెక్టర్, నిర్మాత రంగంలో దిగడం గొప్ప విషయం.

By:  Tupaki Desk   |   7 May 2025 6:17 PM
రీ రిలీజ్ కోసం మెగా బాస్ దిగారంటే..!
X

స్టార్ సినిమాలు రీ రిలీజ్ అవ్వడం కామన్ కానీ ఒక సినిమా రీ రిలీజ్ కోసం ఆ సినిమా హీరో, డైరెక్టర్, నిర్మాత రంగంలో దిగడం గొప్ప విషయం. ఎందుకంటే అది అలాంటి ఇలాంటి సినిమా కాదు తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసిన సినిమా.. అంతేకాదు 35 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆ సినిమా ఇన్నాళ్లకు రీ రిలీజ్ అవుతుండటం తో ఆ సినిమా ఫ్యాన్స్ సగటు సినీ లవర్స్ అంతా సూపర్ ఎజ్గిట్ గా ఉన్నారు.

ఇంతకీ ఆ సినిమా ఏదో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ కాబోతుంది. 35 ఏళ్ల తర్వాత మళ్లీ అదే డేట్ న JVAS రీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా వైజయంతి టీం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. జగదేక వీరుడు అదే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు, నిర్మాత అశ్వనిదత్ ముగ్గురు ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా స్పెషల్ చిట్ చాట్ చేశారు.

స్టార్ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఈ స్పెషల్ వీడియో మే 8న రిలీజ్ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవే స్వయంగా తన కెరీర్ లో నెంబర్ 1 సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి అని చెప్పాడు. అందుకే ఆ సినిమా రీ రిలీజ్ కోసం మెగాస్టార్ కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ స్పెషల్ ఇంటర్వ్యూకి సంబందించిన స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో గ్లోబల్ స్టార్ రాం చరణ్ కూడా ఆ ఉంగరం, చేప ఏమయ్యాయి దీనికి సమాధానం తెలిసిన వ్యక్తి ఒక్కరే అంటూ వీడియోలో మాట్లాడారు.

మొత్తానికి రికార్డులు బద్ధలు కొట్టిన JVAS సినిమా రీ రిలీజ్ కోసం కూడా అదే రేంజ్ ప్లానింగ్ తో వస్తున్నారు. చిరంజీవి కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పాల్గొనడం ఆ సినిమాపై ఆయనకున్న ప్రేమని తెలియచేస్తుంది. మరి JVAS రీ రిలీజ్ అప్పటి రికార్డులను గుర్తు చేసేలా చేస్తుందా.. మెగా ఫ్యాన్స్ ఈ రీ రిలీజ్ పై ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారన్నది చూడాలి. వైజయంతి మూవీస్ టీం మాత్రం ఈ రీ రిలీజ్ కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తుంది.