నాగ్ అన్ని విషయాల్లో నాకు ఇన్సిపిరేషన్
దీంతో చిత్ర యూనిట్ కుబేర విజయోత్సవ సభను ఏర్పాటు చేయగా, ఈ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా హాజరయ్యారు. ఈ సభలో నాగార్జునను చిరంజీవి తెగ ప్రశంసించారు.
By: Tupaki Desk | 23 Jun 2025 10:08 AM ISTధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ తో హిట్ దిశగా దూసుకెళ్తుంది. దీంతో చిత్ర యూనిట్ కుబేర విజయోత్సవ సభను ఏర్పాటు చేయగా, ఈ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా హాజరయ్యారు. ఈ సభలో నాగార్జునను చిరంజీవి తెగ ప్రశంసించారు.
నాగ్, తనను అన్ని విషయాల్లోనూ ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటారని చిరంజీవి అన్నారు. కుబేర సినిమా ఎలా ఉంటుందని నాగ్ ను అడిగినప్పుడు ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ అటెంప్ట్ చేశానన్నాడని, ధనుష్ లీడ్ యాక్టర్ అని చెప్పగా, అలా ఎలా ఒప్పుకున్నావ్ అని అడిగితే రెగ్యులర్ హీరో క్యారెక్టర్లు కాకుండా కొత్తగా చేయాలనిపిస్తోందని నాగ్ అన్నారని చిరూ చెప్పారు.
కుబేర సినిమా చూశాక నాగ్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపించిందని, నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం తనక్కూడా స్పూర్తినిచ్చిందని, ఈ సినిమా తర్వాత మరో 40 ఏళ్లు ఇండస్ట్రీలో తాను ఉంటాననే నాగ్ మాటలు నిజమని చిరంజీవి అన్నారు. దీపక్ లాంటి పాత్ర చేయడం చాలా కష్టమని, నాగ్ ఆ క్యారెక్టర్ ను చాలా తేలికగా చేసేశాడని చిరంజీవి పేర్కొన్నారు.
క్రమశిక్షణ, కొత్తగా ఆలోచించడం, హెల్త్, స్థిత ప్రజ్ఞత లాంటి ఎన్నో విషయాల్లో నాగార్జున తననెప్పుడూ ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటారని, మీ దారిలో నేను కూడా మీకు సమంగా వస్తానని నాగ్ తో అన్నారు చిరూ. నాగ్ ను చూసి తాను కూడా ఫ్యూచర్ లో కొత్త పాత్రలను ఎంచుకుంటానని చిరూ చెప్పారు. నాగ్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అయితే అందుకుంటానని చెప్పాడో అది నిజమైందని ఆయన అన్నారు. ఓ రకంగా చెప్పాలంటే కుబేర కథలో నాగార్జునను శేఖర్ ఊహించుకోవడం, దానికి నాగ్ ఒప్పుకోవడమే సినిమా మొదటి విజయం అని తాను అనుకుంటున్నట్టు చిరూ చెప్పారు.
