Begin typing your search above and press return to search.

రీమేక్ లైతే నో ఛాన్స్ అనేస్తోన్న మెగాస్టార్!

రీమేక్ చిత్రాల‌పై మెగాస్టార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారా? రీమేక్ అంటేనే నోవే అనే ప‌రిస్థితి వ‌చ్చిందా? అంటే అవుననే స‌మాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   20 May 2025 1:30 PM
రీమేక్ లైతే నో ఛాన్స్ అనేస్తోన్న మెగాస్టార్!
X

రీమేక్ చిత్రాల‌పై మెగాస్టార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారా? రీమేక్ అంటేనే నోవే అనే ప‌రిస్థితి వ‌చ్చిందా? అంటే అవుననే స‌మాచారం అందుతోంది. మెగాస్టార్ చిర‌జీవి రీమేక్ చేసిన 'గాడ్ ఫాద‌ర్' భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. ఇది మ‌ల‌యాళ చిత్రం 'లూసీఫర్' కి రీమేక్. సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ భాగ‌స్వామ్యంలో చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీపై నిర్మించారు.

ఫ‌లితం ఆశించిన విధంగా రాక‌పోవ‌డంతో న‌ష్టాలు త‌ప్ప‌లేదు. అటుపై మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో రీమేక్ చిత్రం 'భోళా శంక‌ర్' లో న‌టించారు. ఇది మ‌ల‌యాళ చిత్రం 'వేదాళం'కు రీమేక్ రూపం. ఈ సినిమా అంచనాలు అందుకోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది. అయితే ఈ సినిమా నిర్మాణంలోకి చిరంజీవి ఎంట‌ర్ అవ్వ‌లేదు. ఏ.కె ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మించింది. అలా రెండు రీమేక్ లు చిరంజీవికి పెద్ద షాక్ ఇచ్చా యి.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ కొంత మంది ద‌ర్శ‌కులు రీమేక్ చేద్దామ‌ని కొన్ని ప‌ర‌భాషా చిత్రాల‌తో చిరంజీవిని అప్రోచ్ అయ్యారట‌. కానీ అందుకు చిరంజీవి ఒప్పుకోలేదట‌. ఈ లిస్ట్ లో వి. వి.వినాయ‌క్ కూడా ఉన్నార‌ని స‌మా చారం. ఈయ‌న ఓహిందీ సినిమా రీమేక్ చేద్దామ‌ని వెళ్లారట‌. కానీ చిరంజీవి త‌ర్వాత చూద్దామ‌ని చెప్పా రుట‌. అలాగే `ఎంపురాన్ లూసీఫ‌ర్ 2` రీమేక్ చేద్దామ‌ని మ‌రో డైరెక్ట‌ర్ కూడా వెళ్లారుట‌.

ఆయ‌న‌కు కూడా చిరంజీవి సున్నితంగా నో చెప్పిన‌ట్లు స‌మాచారం. కొంత కాలం పాటు స్ట్రెయిట్ స్టోరీలు రీమేక్ లు చేయ‌బోన‌ని చెప్పిన‌ట్లు కాంపౌండ్ వ‌ర్గాల నుంచి లీకైంది. అలాగ‌ని రీమేక్ లను శాశ్వ‌తంగా వ్య‌తిరేకిస్తార‌ని కాదు. ఇది జ‌స్ట్ గ్యాప్ మాత్ర‌మే అంటున్నారు. అలాగే చిరంజీవి ఏ క‌థ వినాల‌న్నా లైన్ కొత్త‌గా ఉంటే త‌ప్ప ఎంట్రీకి కూడా అవ‌కాశం ఇవ్వ‌లేదట‌.