Begin typing your search above and press return to search.

చిరు-ఓదెల మూవీకి కూడా అదే ఫార్ములానా?

సంక్రాంతి ఫెస్టివ‌ల్‌, దీనికి తోడు సెల‌వులు కూడా రావ‌డంతో 'మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు' స్పీడుకు ఎలాంటి హ‌ద్దు అదుపు లేకుండా పోయింది. దీంతో వ‌రుస‌గా రికార్డుల్ని బ్రేక్ చేస్తూ స‌రికొత్త సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

By:  Tupaki Desk   |   20 Jan 2026 6:00 PM IST
చిరు-ఓదెల మూవీకి కూడా అదే ఫార్ములానా?
X

మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల త‌రువాత టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచారు. దానికి కార‌ణం ఆయ‌న న‌టించిన 'మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు'. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారి మెగాస్టార్ చేసిన ఈ మూవీ సంక్రాంతికి బ‌రిలో నిలిచి విన్న‌ర్ అనిపించుకున్న విష‌యం తెలిసిందే. సినిమా ప్రారంభం నుంచే అంచ‌నాల్ని పెంచేసి ఇప్పుడు సంక్రాంతి బ‌రిలో నిలిచి రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. చిరు కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా రికార్డు సాధించి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌య‌ప‌రుస్తోంది.

అనిల్ రావిపూడి త‌న మార్కు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు కామెడీ అంశాల‌ని జోడించి ఇందులో వింటేజ్ చిరుని ప‌రిచ‌యం చేయ‌డంతో ప్రేక్ష‌కులు ఈ మూవీకి బాక్సాఫీస్ వ‌ద్ద బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. దీంతో ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సునామీని సృష్టిస్తోంది. చిరు టైమింగ్‌, అనిల్ మార్కు వినోదం తోడ‌వ్వ‌డంతో 'మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు' బాక్సాఫీస్ వ‌ద్దు దుమ్ము దులిపేస్తూ క‌లెక్ష‌న్‌ల వ‌ర‌ద పారిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.220 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది.

సంక్రాంతి ఫెస్టివ‌ల్‌, దీనికి తోడు సెల‌వులు కూడా రావ‌డంతో 'మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు' స్పీడుకు ఎలాంటి హ‌ద్దు అదుపు లేకుండా పోయింది. దీంతో వ‌రుస‌గా రికార్డుల్ని బ్రేక్ చేస్తూ స‌రికొత్త సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే చిరు త‌దుప‌రి క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. దీని త‌రువాత చిరు న‌టించిన 'విశ్వంభ‌ర‌' రిలీజ్‌కు రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇక ఇదే ఊపుతో మెగాస్టార్ యంగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెలతో ఓ భారీ యాక్ష‌న్ డ్రామాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్న విష‌యం తెలిసిందే.

హీరో నేచుర‌ల్ స్టార్ ఈ భారీ మూవీని నిర్మించ‌బోతున్నాడు. దీనికి సంబంధించిన అప్ డేట్‌ని ఇప్ప‌టికే ఇచ్చేసిన టీమ్ ఓ ప‌క్క `ది ప్యార‌డైజ్‌`ని పూర్తి చేస్తూనే మరో ప‌క్క చిరు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని మొద‌లు పెట్టింద‌ట‌. ఇదిలా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌పోర్టింగ్ స్టార్ లేకుండా సినిమాలు చేయ‌డానికి చిరు ఇష్ట‌ప‌డ‌టం లేదు. 'ఆచార్య‌'లో రామ్ చ‌ర‌ణ్‌, 'గాడ్‌ఫాద‌ర్‌'లో స‌ల్మాన్‌ఖాన్‌, స‌త్య‌దేవ్‌, 'వాల్తేర్ వీర‌య్య‌'లో ర‌వితేజ‌, 'మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు'లో విక్ట‌రీ వెంక‌టేష్‌లు ఉండేలా చూసుకున్నారు.

ఇందులో ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్ త‌ప్ప వాల్తేరు వీర‌య్య‌, 'మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు' చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచి మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి. దీంతో చిరు మ‌రి ఓదెల‌తో చేయ‌బోతున్న మూవీ కోసం కూడా ఇదే స‌క్సెస్ ఫార్ములాని ఫాలో అవుతూ మ‌రో స్టార్‌ని రంగంలోకి దించేస్తాడా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ర‌జ‌నీ త‌ర‌హాలో స‌పోర్టింగ్ స్టార్‌తోనే మ‌ళ్లీ రంగంలోకి దిగుతారా?.. లేక సోలోగానే చేస్తారా? అన్నది తెలియాలంటే నాని టీమ్ ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.