Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కి నాగ్ ఫార్ములా వ‌ర్కౌట్ అయిందే!

ఇక ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంతో కాలంగా స్నేహితులు. ఇండస్ట్రీలో స్నే హం అంటే వాళ్ల‌దే గొప్ప అన్నంత‌గా క‌నిపిస్తారు.

By:  Tupaki Desk   |   24 July 2025 6:00 AM IST
మెగాస్టార్ కి నాగ్ ఫార్ములా వ‌ర్కౌట్ అయిందే!
X

మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్ లో ఎంత స్లిమ్ గా క‌నిపిస్తున్నారో తెలిసిందే. 70 ఏళ్ల చిరంజీవి ఏకంగా 40 ఏళ్ల వ‌య‌స్కుడిలా క‌నిపిస్తున్నారు. వ‌య‌సు ఏకంగా 30 ఏళ్లు త‌గ్గిన‌ట్లే చిరు లుక్ వైర‌ల్ అవుతోంది. చిరంజీవిలో ఇలాంటి ట్రాన్స‌ప‌ర్మేష‌న్ ఇంత వ‌ర‌కూ ఎన్న‌డు జ‌ర‌గ‌లేదు. ఖైదీ నెంబ‌ర్ 150వ సినిమా కోసం కొంత వ‌ర్కౌట్ చేసారు. రాజ‌కీయాలు అనంత‌రం కొంత గ్యాప్ అనంత‌రం కంబ్యాక్ ప్లాన్ చేసుకునే నేప‌థ్యంలో లుక్ ప‌రంగా చిన్న పాటి మార్పులు తీసుకొచ్చారు. కానీ తాజా లుక్ మాత్రం నెవెర్ బీపోర్ అనే చెప్పాలి.

మ‌రి చిరులో ఇంత‌టి ట్రాన్స‌ప‌ర్మేష‌న్ కి కార‌ణం ఎవ‌రు? అంటే కింగ్ నాగార్జున అన‌డంలో ఎలాంటి సందే హం లేదు. ఈ విష‌యాన్ని చిరంజీవి ఓపెన్ గానే చెప్పారు. ఫిట్ నెస్ విష‌యంలో నాగార్జున త‌న‌కు స్పూర్తి అని చాలా సంద‌ర్బాల్లో చెప్పారు చిరు. డాన్సుల విష‌యంలో చిరంజీవి నాగార్జున‌కు స్పూర్తి అయితే? త‌ను నాకు ఛార్మింగ్ లుక్ లో త‌న టెక్నిక్ నే ప‌ట్టుకున్న‌ట్లు చెప్పుకొచ్చారు. ఆర‌కంగా చిరంజీవి స్మార్ట్ లుక్ వెనుక కింగ్ కీల‌క పాత్ర ధారి. 157వ సినిమాలో చిరంజీవి స్మార్ట్ లుక్ లో క‌నిపించ‌నున్నారు.

ఇక ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంతో కాలంగా స్నేహితులు. ఇండస్ట్రీలో స్నే హం అంటే వాళ్ల‌దే గొప్ప అన్నంత‌గా క‌నిపిస్తారు. ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా ఎంతో స్వ‌చ్ఛంగా మాట్లా డుకుంటారు. ఆ కాంబినేష‌న్ లో ఓ సినిమా రావాల‌ని అభిమానులు కూడా అంతే ఆశిస్తున్నారు. మ‌రి చిరు-నాగ్ మ‌న‌సులో ఏముందో? చూడాలి. బ్యాకెండ్ లో ఇద్ద‌రి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని స్టోరీలు మాత్రం సిద్దం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఇద్ద‌రు వేర్వేరు చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి `విశ్వంభ‌ర` సినిమాతో పాటు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు పెద్ద గ్యాప్ లేకుండానే రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. అలాగే కింగ్ నాగార్జున ఇటీవ‌లే `కుబేర‌`తో మంచి విజ‌యం అందుకున్నారు. త్వ‌ర‌లో `కూలీ` చిత్రంతో రెడీ అవుతున్నారు. అలాగే కింగ్ సోలో చిత్రం కూడా యువ ద‌ర్శ‌కుడు కార్తీక్ తో క‌న్ప‌మ్ అయిన సంగ‌తి తెలిసిందే.