చిరూ ఓదెల సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్
గత కొన్ని సినిమాలుగా చిరంజీవి నుంచి వచ్చిన సినిమాలేవీ అంచనాలను అందుకోలేకపోయాయి.
By: Tupaki Desk | 16 Jun 2025 5:30 PMగత కొన్ని సినిమాలుగా చిరంజీవి నుంచి వచ్చిన సినిమాలేవీ అంచనాలను అందుకోలేకపోయాయి. అతన్నుంచి వచ్చిన ఆఖరి సినిమా భోళా శంకర్ డిజాస్టర్ అవడంతో తర్వాతి సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎంతో ఆచితూచి వ్యవహరించి సినిమాలను ఒప్పుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ వశిష్టతో విశ్వంభరను లైన్ లో పెట్టి ఆ సినిమాను పూర్తి చేశాడు. త్వరలోనే విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశ్వంభర సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే చిరంజీవి మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాటిని కూడా లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ కాగా, మరొకటి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నిర్మాతగా వస్తున్న సినిమా. ఆల్రెడీ అనిల్ తో సినిమాను మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసిన చిరూ, ఆ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నాడు.
ఆ సినిమా పూర్తైన తర్వాత శ్రీకాంత్ ఓదెలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు చిరంజీవి. ఈలోగా శ్రీకాంత్ కూడా ప్రస్తుతం తాను నానితో చేస్తున్న ది ప్యారడైజ్ సినిమాను పూర్తి చేసి ఫ్రీ అవుతాడు. దసరా సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ మొదటి సినిమాతోనే మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ నమ్మకంతోనే నాని, శ్రీకాంత్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చి ది ప్యారడైజ్ చేస్తున్నాడు.
అయితే ది ప్యారడైజ్ సినిమా ఇంకా పూర్తి కానే లేదు, ఇంకా చిరంజీవితో శ్రీకాంత్ సినిమాను మొదలుపెట్టిందే లేదు, అప్పుడే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా శ్రీకాంత్ దర్శకత్వంలో రాబోయే సినిమా చాలా కొత్తగా ఉంటుందని, డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరూ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడని మరియు ఈ సినిమాలో చిరంజీవి పక్కన ఎలాంటి హీరోయిన్ కనిపించదని, సాంగ్స్ కూడా ఉండవని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది.