అందమైన హిల్ స్టేషన్ లో నయన్ తో చిరు అలా!
మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి సహా ప్రధాన తారాగణంపై దర్శకుడు అనీల్ రావిపూడి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
By: Tupaki Desk | 12 Jun 2025 6:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి సహా ప్రధాన తారాగణంపై దర్శకుడు అనీల్ రావిపూడి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా రెండవ షెడ్యూల్ అందమైన హిల్ స్టేషన్ ముసోరీలో ప్రారంభమైంది. ఇక్కడ చిరంజీవి-నయనతారపై మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ సన్నివేశాల్లో రొమాంటిక్ టచ్ ఉందన్న విషయం లీకైంది.
కామెడీ నేపథ్యం గల చిత్రాల్లో చిరంజీవి పాత్రలో రొమాంటిక్ టచ్ కనిపిస్తుంటుంది. అది హాస్యభరితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అనీల్ రావిపూడి కూడా స్క్రిప్ట్ లో అలాంటి సన్నివేశాలు కొన్ని రాసినట్లు తెలుస్తోంది. పైగా 90వ దశకంలో చిరంజీవిని..అప్పటి ఆయన కామెడీని హైలైట్ చేస్తున్నారు. నాటి భామలతో చిరంజీవి రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోభాగంగా చిరంజీవి-నయనతార మధ్య కొన్ని రొమాంటిక్ కామెడీ సన్నివేశాలకు స్కోప్ ఉందని తెలుస్తోంది.
చిరంజీవితో నయనతార నటించడం మూడవసారి. తొలిసారి 'సైరా నరసింహారెడ్డి'లో నటించారు. ఆ సినిమాలో నయనతార చిరంజీవి భార్య పాత్రలో కనిపిస్తారు. ఇది చారీత్రాత్మక నేపథ్యంతో కూడిన కథ కావడంతో రొమాంటిక్ అంశాలు ఎక్కడా కనిపించలేదు. అటుపై 'గాడ్ ఫాదర్' లోనూ నటించారు. కానీ అందులో నయన్ చిరంజీవి చెల్లెలు పాత్ర పోషించారు. తాజా సినిమాలో ప్రియురాలి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
మసూరీలోనే ఈ షెడ్యూల్ పది రోజుల పాటు జరుగుతుంది. ఇందులో ప్రధానంగా నయన్-చిరు సన్నివే శాలకే పెద్ద పీట వేసినట్లు సమాచారం. చాలా కాలం తర్వాత చిరంజీవి ఎంతో ఇష్టపడి చేస్తోన్న కామెడీ చిత్రమిది. అనీల్ కూడా మంచి సక్సెస్ లో ఉన్నాడు. కామెడీలో ఆయనకంటూ ఓ శైలి ఉంది. దీంతో చిరంజీవి పాత్రను ఎంత కొత్తగా చూపించబోతున్నాడు? అన్నది ఆసక్తికరంగా మారింది.
