సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్తున్న అనిల్!
అసలే అనిల్ రావిపూడికి మంచి కామెడీ సినిమాలు తీసి ఆడియన్స్ ను అలరిస్తారని పేరుంది.
By: Tupaki Desk | 7 July 2025 8:30 PMభోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి లైనప్ చాలా సాలిడ్ గా ఉంది. ఓ వైపు యంగ్ డైరెక్టర్ వశిష్టతో సోషియా ఫాంటసీ డ్రామాగా విశ్వంభరను చేస్తున్న చిరూ, మరోవైపు టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వెంకీతో కలిసి సంక్రాంతి కి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న అనిల్, ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారు.
అసలే అనిల్ రావిపూడికి మంచి కామెడీ సినిమాలు తీసి ఆడియన్స్ ను అలరిస్తారని పేరుంది. ఇప్పుడు అతనికి చిరంజీవి లాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరో దొరికితే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంచి చెప్పనక్కర్లేదు. చిరూ కెరీర్ లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే అనిల్ రావిపూడి రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేశారు.
ఇప్పుడు మెగా157కు సంబంధించిన మూడో షెడ్యూల్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే జులై 8న మెగా157 మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో కొన్ని రోజుల షూటింగ్ తర్వాత చిత్ర యూనిట్ కేరళకు వెళ్లనుందని తెలుస్తోంది. జులై 22కు మెగా157 మూడో షెడ్యూల్ ను పూర్తి చేయనున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
ఫిల్మ్ మేకింగ్ లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అని పేరున్న అనిల్ రావిపూడి మెగా157ను మరింత స్పీడుగా తెరకెక్కిస్తున్నారు. అలా అని క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదని తెలుస్తోంది. తన గత సినిమాల కంటే మెరుగ్గా ఈ సినిమాను క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మెగా157ను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.