అనిల్ రావిపూడి అప్పుడే లాక్ చేసేశాడా?
ఇదిలా ఉంటే విశ్వంభర తర్వాత చిరంజీవి, అనిల్ రావిపూడితో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లలేదు కానీ అప్పుడే దీనికి సాలిడ్ బజ్ నెలకొంది.
By: Tupaki Desk | 21 May 2025 6:30 PMభోళా శంకర్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అందుకే కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమాను కూడా పక్కన పెట్టి మరీ బింబిసార ఫేమ్ వశిష్టతో సోషియో ఫాంటసీ డ్రామను పట్టాలెక్కించాడు. అనౌన్స్‌మెంట్ సమయంలో విశ్వంభర సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.
కానీ ఎప్పుడైతే విశ్వంభర నుంచి టీజర్ వచ్చిందో అప్పట్నుంచి ఈ సినిమాపై బజ్ తగ్గుతూ వచ్చింది. విశ్వంభర టీజర్ లోని వీఎఫ్ఎక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయంటూ అందరూ ఈ సినిమాపై కామెంట్స్ చేయడం, ఆ తర్వాత వీఎఫ్ఎక్స్ వర్క్స్ బాధ్యతల్ని మరో కంపెనీకి ఇవ్వడం, ఆపై రిలీజ్ పోస్ట్ పోన్ అవడం ఇలా ప్రతీదీ విశ్వంభరపై హైప్ ను తగ్గిస్తూ వచ్చాయి.
ఇదిలా ఉంటే విశ్వంభర తర్వాత చిరంజీవి, అనిల్ రావిపూడితో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లలేదు కానీ అప్పుడే దీనికి సాలిడ్ బజ్ నెలకొంది. మెగా157 వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కోసం మేకర్స్ లుక్ టెస్ట్ ను పూర్తి చేశారని సమాచారం.
మెగా157లో చిరంజీవిని అనిల్ రావిపూడి వింటేజ్ లుక్ లో ప్రెజెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ దాని కోసం లుక్ ను కూడా లాక్ చేసుకున్నారట. లాక్ చేసుకున్న లుక్ తోనే షూటింగ్ కు రెడీ అవనున్నట్టు సమాచారం. మెగా157లో వీలైనంత వరకు మెగాస్టార్ ను స్టైలిష్ గానే చూపించాలని చూస్తున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.