మెగా157పై క్రేజీ న్యూస్
విశ్వంభర షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసిన చిరంజీవి, ప్రస్తుతం టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
By: Tupaki Desk | 8 Jun 2025 3:42 PM ISTప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండింటిలో ఒక సినిమాగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్టతో విశ్వంభర చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న విశ్వంభరపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, కీరవాణి విశ్వంభరకు సంగీతం అందిస్తున్నాడు.
విశ్వంభర షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసిన చిరంజీవి, ప్రస్తుతం టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి ఆ సక్సెస్ ఇచ్చిన జోష్ లో తన నెక్ట్స్ మూవీని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో లాక్ చేసుకుని దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేశాడు. చిరంజీవి కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
మెగా157లో చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని, ఈ రెండు పాత్రల్లో ఒక పాత్ర వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తూ కామెడీ యాంగిల్ లో ఉండగా, రెండో క్యారెక్టర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ మొదటి షెడ్యూల్ లో చిరంజీవి- నయనతార మధ్య కామెడీ సీన్స్ ను షూట్ చేశారని, ఈ సీన్స్ లో చిరూ- నయన్ మధ్య కామెడీ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మెగా157 సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
