Begin typing your search above and press return to search.

చిరంజీవి ఎత్తుకున్న‌ది క్లీన్‌కారాను కాదు.. ఆ పాప ఎవ‌రంటే

అప్పుడ‌ప్పుడు మ‌నం క‌ళ్ల‌తో చూసిన ఎన్నో విష‌యాలు కూడా నిజం కావు. అలాంటిది సోష‌ల్ మీడియాలో చూసిన అన్ని విష‌యాలనూ న‌మ్మ‌డానికి లేదు.

By:  Tupaki Desk   |   19 May 2025 5:51 AM
చిరంజీవి ఎత్తుకున్న‌ది క్లీన్‌కారాను కాదు.. ఆ పాప ఎవ‌రంటే
X

అప్పుడ‌ప్పుడు మ‌నం క‌ళ్ల‌తో చూసిన ఎన్నో విష‌యాలు కూడా నిజం కావు. అలాంటిది సోష‌ల్ మీడియాలో చూసిన అన్ని విష‌యాలనూ న‌మ్మ‌డానికి లేదు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ప్ర‌తీ ఒక్క‌రికీ స్వేచ్ఛ విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో నిజానిజాల‌తో సంబంధం లేకుండా ఎవ‌రికి అనిపించింది వాళ్లు రాసేస్తూ న‌చ్చిన స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు.


దీంతో అప్పుడ‌ప్పుడు నిజ‌మేదో, అబ‌ద్ధ‌మేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. అయితే సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌ల్లో ఏది నమ్మాలి? ఏది న‌మ్మ‌కూడ‌దు అనేది పూర్తిగా మ‌న ఇష్టంపై ఆధార‌ప‌డి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని పోస్టులు చూసిన‌ప్పుడు ఫేక్ న్యూస్ లు కూడా నిజంలానే అనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన‌వి ఎక్కువ‌.

అయితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఓ చిన్న పాప‌ను ఎత్తుకుని ఉన్న ఫోటో నెట్టింట వైర‌ల్ అవగా, ఆ ఫోటోలో చిరంజీవి ఎత్తుకున్న‌ది రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌నల ముద్దుల కూతురు క్లిన్ కారా అని సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది. అయితే ఆ వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేదు. ఆ ఫోటోలో ఉన్న‌ది రామ్ చ‌ర‌ణ్ కూతురు క్లీన్ కారా కాద‌ని తెలుస్తోంది.

ఆ ఫోటోలో చిరంజీవి ఎత్తుకున్న అమ్మాయి నవిష్క కొణిదెల‌. చిరంజీవి రెండో కూతురు శ్రీజ కూతురే నవిష్క‌. 2021లో చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆ ఫోటోను న‌విష్క అకౌంట్ నుంచి షేర్ చేయ‌గా, దాన్ని నెటిజ‌న్లు క్లీన్ కారా ఫోటోగా ప్ర‌చారం చేశారు. శ్రీజ, త‌న కూతురు న‌విష్క కూడా చిరంజీవి ఇంట్లోనే ఉంటార‌నే విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే రామ్ చ‌ర‌ణ్- ఉపాస‌న త‌మ కూతురు ఫేస్ ను ఇప్ప‌టివ‌ర‌కు బ‌య‌ట‌కు రివీల్ చేసింది లేదు. మొన్నా మ‌ధ్య అన్‌స్టాప‌బుల్ షో లో బాల‌య్య క్లీన్ కారాను అంద‌రికీ ఎప్పుడు చూపిస్తార‌ని అడ‌గ్గా, ఎప్పుడైతే క్లీన్ కారా త‌న‌ను నాన్న అని పిలుస్తుందో ఆ రోజు త‌న కూతురిని అంద‌రికీ ప‌రిచయం చేస్తాన‌ని రామ్ చ‌ర‌ణ్ చెప్ప‌డంతో మెగా ఫ్యాన్స్ అంతా దాని కోసం వెయిట్ చేస్తున్నారు.