వీరయ్య గిఫ్టిచ్చారు.. నెక్ట్స్ డాకు మహారాజ్?
తాజాగా బాబీని తన ఇంటికి ఆహ్వానించి చిరు అభినందించారు.అంతేకాదు బాబీకి ఒక క్లాసీ ఒమేగా సీమాస్టర్ వాచ్‌ను బహుకరించారు.
By: Tupaki Desk | 23 May 2025 11:20 AM ISTతనను అభిమానించి, ప్రేమించే వారికి తిరిగి వాటిని కానుకగా ఇవ్వడం మెగాస్టార్ చిరంజీవి అలవాటు. ఇప్పుడు అలాంటి ఒక కానుకను తన అభిమాని బాబి అలియాస్ కె.ఎస్. రవీంద్రకు అందించారు చిరు. బాబి తనను ఎంతగానో అభిమానిస్తాడు. ఒక మెగాభిమానిగా అతడు పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఇక్కడ మనుగడను సాగించాడు. ఇప్పుడు దర్శకుడిగా ఎదిగాడు.
అంతేకాదు.. తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవికి అదిరిపోయే బ్లాక్ బస్టర్ ని అందించాడు బాబి. చిరంజీవి- బాబి కాంబినేషన్ లో వచ్చిన `వాల్తేరు వీరయ్య` బంపర్ హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సాధించిన ఘనతను చిరు ఎంతమాత్రం మర్చిపోలేదు. తాజాగా బాబీని తన ఇంటికి ఆహ్వానించి చిరు అభినందించారు.అంతేకాదు బాబీకి ఒక క్లాసీ ఒమేగా సీమాస్టర్ వాచ్‌ను బహుకరించారు. ఇది అరుదైన కానుక.. బాబి తన జీవితంలో మర్చిపోలేని రేర్ మూవ్ మెంట్ ఇది.
అభిమానిగా బాబి దీనికి ఎంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. మెగాస్టార్ ను అభిమానించి సినిమా తీసాడు కాబట్టే వాల్తేరు వీరయ్యలో చిరు పాత్ర అంత అద్భుతంగా పండింది. అందుకే చిరు బాబీకి ఎంతగానో కనెక్ట్ అయి ఉన్నారు. బాబి మరో స్క్రిప్టును రెడీ చేసి చిరుని కలవాలే కానీ, వెంటనే సినిమా ప్రారంభించేందుకు ఆయన సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ జోడీ నుంచి మరో సినిమా రావాలని అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. పరిశ్రమలో ఇద్దరు దిగ్గజ హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు వరుసగా బ్లాక్ బస్టర్లు అందించిన ఘనత బాబీ సొంతం. వాల్తేరు వీరయ్య తర్వాత బాలకృష్ణతో డాకు మహారాజ్ లాంటి హిట్ సినిమా తీసాడు బాబి. అందుకే ఇప్పుడు బాబీని పిలిచి ఎన్బీకే కూడా ఏదైనా కానుకిస్తారేమో చూడాలి.
