Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ స్టోరీస్‌తో భ‌య‌పెట్టేవాడా?

మెగాస్టార్ చిరంజీవి వార‌సుడిగా గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పాన్ ఇండియా హీరోల స‌ర‌స‌న నిల‌బ‌డి తండ్రికి త‌గ్గ త‌న‌యుడుగా జేజేలు అందుకుంటున్నాడు.

By:  Ravindar Gorantla   |   10 March 2026 8:00 PM IST
ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ స్టోరీస్‌తో భ‌య‌పెట్టేవాడా?
X

మెగాస్టార్ చిరంజీవి వార‌సుడిగా గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పాన్ ఇండియా హీరోల స‌ర‌స‌న నిల‌బ‌డి తండ్రికి త‌గ్గ త‌న‌యుడుగా జేజేలు అందుకుంటున్నాడు. ఆయ‌న‌ పెద్ద కుమార్తె సుస్మిత కూడా కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా తండ్రి చిరు సినిమాల‌కు వ‌ర్క్ చేస్తూ కెరీర్ ప్రారంభించింది. మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన `ఖైదీ నంబ‌ర్ 150`తో త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించింది. ఆ త‌రువాత రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం`, చిరు `సైరా న‌ర‌సింహారెడ్డి`, ఆచార్య‌, వాల్తేరు వీరయ్య వంటి సినిమాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేసింది.

ఆ త‌రువాత గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థ‌ని స్థాపించి తొలి ప్ర‌య‌త్నంగా `షూట్ అవుట్ ఎట్ ఆరేర్‌` అనే వెబ్ సిరీస్‌ని, న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో `సేనాప‌తి` వెబ్ మూవీని నిర్మించి అభిరుచి గ‌ల ప్రొడ్యూస‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. నేడు ఆమె పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిరు త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని, సుస్మిత‌తో ఉన్న కొన్ని ఫొటోల‌ని పంచుకున్నారు. ప్ర‌స్తుతం చిరు పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇదిలా ఉంటే సుస్మిత ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టిస్తూ బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విషయాల్ని వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మెగా ఫ్యామిలీలో ఉన్న పిల్ల‌లంద‌రికీ ఇంగ్లీష్ మ్యూజిక్‌తో పాటు ది గాడ్ ఫాద‌ర్‌, స్టార్ వార్స్ వంటి అంత‌ర్జాతీయ క్లాసిక్ సినిమాల‌ని ప‌రిచ‌యం చేశార‌ని తెలిపింది. రాత్రివేళ‌ల్లో పిల్ల‌లంద‌రిని ఒక చోట చేర్చి అంద‌రికి హార‌ర్ క‌థ‌లు చెప్పేవార‌ని షాక్ ఇచ్చింది. ఆ క‌థ‌లు విని భ‌య‌ప‌డి పిల్ల‌లంతా పారిపోయేవార‌ని, అయితే తాను మాత్రం అక్క‌డే కూర్చుని బాబాయ్ చెబుతున్న క‌థ‌లు వినేదాన్న‌ని తెలిపింది.

పిల్ల‌లంతా హార‌ర్ స్టోరీస్ విని పారిపోతే సుస్మిత మాత్రం అక్క‌డే ఉండ‌టానికి కార‌ణం త‌న‌కు హార‌ర్ స్టోరీస్, సినిమాలు అంటే చాలా ఇష్టం కాబ‌ట్టి. అందుకే అక్క‌డే ఉండి ప‌వ‌న్ చెప్పే హార‌ర్ స్టోరీస్ వినేద‌ట‌. అంటే ఫ్యూచ‌ర్‌లో సుస్మిత నుంచి హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చ‌న‌మాట‌. ఇదిలా ఉంటే వెబ్ సిరీస్‌, ఓటీటీ మూవీని నిర్మించిన సుస్మిత త‌న గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటితో క‌లిసి ఫాద‌ర్ చిరు హీరోగా అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన థియేట్రిక‌ల్ ఫ‌స్ట్ మూవీ `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు`.

హిట్ మెషీన్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో నిలిచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం తెలిసిందే. వింటేజ్ చిరుని ప‌రిచ‌యం చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు సృష్టించింది. ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.375 కోట్లు రాబ‌ట్టి త‌క్కువ టైమ్‌లోనూ అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ప్రాంతీయ సినిమాగా రికార్డు సాధించింది. తొలి ప్ర‌య‌త్నంలోనే ఫాద‌ర్ చిరుకు భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని అందించి స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ అనిపించుకుంది.